Rajasthan BJP Manifesto: రాజస్తాన్ బీజేపీ మ్యానిఫెస్టో విడుదల-450కే గ్యాస్, 2.5 లక్షల ఉద్యోగాలు..
ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరాది రాష్ట్రం రాజస్తాన్ లో విపక్ష బీజేపీ ఇవాళ మ్యానిఫెస్టో ప్రకటించింది. ఇవాళ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ రాజస్తాన్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చింది. రాష్ట్రంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, మహిళలపై దాడుల్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ కీలక హామీలు ఇచ్చింది. తమకు ఈసారి ఓటు వేస్తే కచ్చితంగా ఈ హామీలు నెరవేరుస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
రాజస్తాన్ బీజేపీ మ్యానిఫెస్టోలో ఉజ్వల గ్యాస్ కనెకన్లు కలిగిన వారికి రూ.450కే గ్యాస్ సిలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. రైతులకు పీఎం-కిసాన్ పథకం ద్వారా సాయం అందిస్తామని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్ లు, ఇతర స్కాంలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని కూడా బీజేపీ మ్యానిఫెస్టోలో పేర్కొంది.

రైతుల నుంచి గోధుమల్ని క్వింటాకు రూ.2700 చెల్లించి కొనుగోలు చేస్తామని, గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా చెల్లిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద చెల్లించే మొత్తాన్ని 12 వేలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. కేంద్రం సహకారంతో తూర్పు రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టును నిర్మిస్తామని కూడా బీజేపీ హామీ ఇస్తోంది. లడో ప్రోత్సాహన్ యోజన కింద ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 2 లక్షల పొదుపు బాండ్, లక్షపతి దీదీ పథకం కింద దాదాపు ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలికలకు స్కూటర్లు, కేజీ నుంచి ఉచిత విద్య కల్పిస్తామని కూడా బీజేపీ వాగ్దానం చేసింది.
విద్యార్దులకు ఇచ్చిన హామీల్లో పేద విద్యార్దులకు పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అవసరాల కోసం ఏటా రూ.12వేలు ఇస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రతీ డివిజన్ లోనూ రాజస్తాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఆరోగ్య రంగంలో, భామాషా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి మరియు 15,000 మంది వైద్యులు మరియు 20,000 మంది పారామెడికల్ సిబ్బంది నియామకానికి పార్టీ హామీ ఇచ్చింది.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications