ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టో-పెన్షన్ల పెంపు, మహిళలకు 2500..!
ఢిల్లీలో వచ్చే నెల 5న జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకున్నా ఢిల్లీలో మాత్రం గత మూడుసార్లు బీజేపీకి నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో ఈసారి సంక్షేమ మంత్రం జపిస్తున్న బీజేపీ ఇవాళ తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. సంకల్ప్ పత్ర పేరుతో మూడు భాగాలుగా ఈసారి బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మ్యానిఫెస్టో విడుదల చేశారు.
మహిళలు, యువత, అసంఘటిత కార్మికులు, మధ్య ఆదాయ వర్గాలను పరిగణనలోకి తీసుకుని మ్యానిఫెస్టో విడుదల చేసినట్లు జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా ఢిల్లీలో ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ప్రకటించారు. ఆ పథకాలన్నీ మరింత ప్రభావవంతంగా బలోపేతం అవుతాయని, అవినీతికి తావు లేకుండా అమలవుతాయని తెలిపారు.

After forming the govt in Delhi, we will implement the Central government's Ayushman Bharat for 51 lakh people, who were deprived of its benefits under AAP, in the first Cabinet meeting. Besides, we will provide additional cover of Rs 5 lakh.
— BJP (@BJP4India) January 17, 2025
- Shri @JPNadda #BJPKeSankalp pic.twitter.com/b76oRzODyz
ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇచ్చిన హామీల్లో మహిళలకు నెలకు రూ.2500, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, గ్యాస్ సిలెండర్ పై రూ.500 రాయితీ, హోలీ, దీపావళికి ఒక్కో గ్యాస్ సిలెండర్ ఉచితంగా ఇవ్వడం, మహిళలకు 6 రకాల పోషక కిట్లు ఇవ్వడం, గర్భవతులకు రూ.21 వేల నగదు చెల్లింపు వంటివి ఉన్నాయి. కేంద్రంలో 2014లో తాము 500 వాగ్దానాలు చేశామని, 499 నిలబెట్టుకున్నామని, 2019లో 235 చేశామని, అందులో 225 నిలబెట్టుకున్నామని నడ్డా గుర్తుచేశారు. మిగిలినవి కూడా అమలు దశలోనే ఉన్నాయని నడ్డా చెప్పారు.ఢిల్లీని అవినీతి నుంచి విముక్తి చేస్తామని వెల్లడించారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications