MP Polls : మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రచారానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల..

మధ్యప్రదేశ్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇక్కడ అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ.. కీలక నేతల్ని రంగంలోకి దింపబోతోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసింది. 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ ఇవాళ ప్రకటించింది. ఇందులో దాదాపు బీజేపీ కీలక నేతలంతా ఉన్నారు.

మద్యప్రదేశ్ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆదిత్యనాథ్, జ్యోతిరాదిత్య సింధియా, శివ్ రాజ్ సింగ్ చౌహాన్, గడ్కరీ, శివ్ ప్రకాష్, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ వంటి వారు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రంలోని పలువురు ఛరిష్మా ఉన్న నేతల్ని, కులాలపై ప్రభావం చూపే నేతల్ని కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరంతా త్వరలో ప్రచార బరిలోకి దిగనున్నారు.

BJP releases list of 40-star campaigners for Madhya Pradesh Polls

మధ్యప్రదేశ్ లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఈసారి సీఎం అభ్యర్ధిని ముందుగా ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తోంది. అలాగే ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రజా వ్యతిరేకత ప్రభావం పార్టీపై ప్రభావం చూపకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు గెలుపు అవకాసాలు ఉన్నట్లు పలు సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీపై ఒత్తిడి అమాంతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్లు బీజేపీని ఏమేరకు గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+