శశికళకు చెక్, అన్ని వైపులా ఇలా కట్టడి!: పన్నీరుసెల్వంతో బీజేపీ పావులు?
జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పాలని చూస్తోందా? అంటే పరిణామాలు చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
చెన్నై: జయలలిత మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పాలని చూస్తోందా? అంటే పరిణామాలు చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే పార్టీలో శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం వర్గాలుగా ఉన్నాయని అంటున్నారు.
జయలలిత మృతి నేపథ్యంలో శశికళ మొత్తం చక్రం తిప్పారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి పైన కూడా కన్నేశారు.
పన్నీరు సెల్వం పావుగా బీజేపీ చక్రం!
ఇప్పుడు పన్నీరు సెల్వం పావుగా బీజేపీ చక్రం తిప్పుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పన్నీరు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతనే మాజీ సీఎస్ రామ్మోహన రావు ఇంటి పైన ఐటీ దాడులు జరిగాయని అంటున్నారు.

శశికళకు చెక్ చెప్పే ప్లానా?
తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే శశికళ పైన ఒత్తిడి పెంచేందుకు, శశికళకు చెక్ పెట్టేందుకు పన్నీరు సెల్వాన్ని పావుగా ఉపయోగించుకుంటూ బీజేపీ ముందుకెళ్తోందా అనే చర్చ సాగుతోంది.
మాజీ సీఎస్ రామ్మోహన రావు జయలలితకు, శశికళకు దగ్గర. ఆయన ఇంటి పైన, అలాగే శశికళ మరికొందరు సన్నిహితుల ఇళ్ల పైన ఐటీ దాడులు జరిగాయని అంటున్నారు.
శశికళను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నమా?
త్వరలో మరికొందరు అధికారులు, ఇతరుల పైన ఐటీ దాడులు జరగవచ్చునని అంటున్నారు. ఇప్పటికే ఐటీ దాడులతో తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని దాడులు జరుగుతాయని చెప్పడం ద్వారా శశికళను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
ఓ వైపు ఐటీ దాడులు, మరోవైపు చిన్నమ్మను వ్యతిరేకిస్తున్న దీపా జయకుమార్‌కు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పరోక్ష మద్దతు ఇస్తున్నారని అంటున్నారు. దీపకు మద్దతిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఇంకోవైపు ట్రాఫిక్ రామస్వామి.. జయలలితకు అందిన చికిత్సపై కోర్టుకు వెళ్లారు. జయ మృతి పైన అనుమానాలు.. ఇవన్నీ శశికళ పైన ఒత్తిడి పెంచేందుకు, అలాగే చెక్ చెప్పేందుకు అంటున్నారు.
పన్నీరు సెల్వం బీజేపీకి అవకాశమిస్తే..
శశికళ పైన ఒత్తిడి పెంచాలనే ప్లాన్ వెనుక బీజేపీ ఉందని, దానికి పన్నీరు సెల్వం మద్దతు పలుకుతుండవచ్చుననే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే బీజేపీ కల నెరవేరుతుందా? లేక పన్నీరు సెల్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వస్తుందా? అనే చర్చ సాగుతోంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications