బీజేపీ నేత తజిందర్ బగ్గాకు మరో షాక్: కొత్తగా అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పంజాబ్ కోర్టు

న్యూఢిల్లీ/మొహాలి: ఢిల్లీ బీజేపీ నేత తజిందర్ బగ్గా అరెస్టు వ్యవహారం శుక్రవారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతా సమసిపోయి ఇంటికి చేరుకున్న తజింగర్ బగ్గాకు పంజాబ్ కోర్టు షాకిచ్చింది. తాజాగా, శనివారం తజిందర్ బగ్గాకు కొత్త అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంజాబ్ కోర్టు.

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ సింగ్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసి కొన్ని గంటల్లోనే విడుదల చేసిన మరుసటి రోజు.. పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ కోర్టు శనివారం బీజేపీ నాయకుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రవ్తేష్ ఇంద్రజిత్ సింగ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

BJPs Tajinder Bagga Faces New Arrest Warrant Issued By Punjab Court

"తజిందర్ పాల్ సింగ్ బగ్గా (s/o ప్రిత్పాల్ సింగ్, r/o B-1/170, జనక్‌పురి న్యూఢిల్లీ)పై U/Sec 153-A, 505, 505 (2), 506 IPC ప్రకారం శిక్షార్హమైన నేరం మోపబడింది. మీరు తాజిందర్ పాల్ సింగ్ బగ్గాను అరెస్టు చేయాలని, అతడ్ని మా ముందు హాజరుపరచాలని ఇందుమూలంగా ఆదేశిస్తున్నాం, "అని కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు తదుపరి తేదీని మే 23కు షెడ్యూల్ చేయబడింది.

రాజకీయ దుమారం రేపిన తజిందర్ సింగ్ బగ్గా అరెస్ట్ వ్యవహారం

బీజేపీ యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ బగ్గాను శుక్రవారం ఉదయం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరింపులకు గురిచేసిన కేసులో ఈ అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ అరెస్ట్ జరిగిన కొద్ది గంటల్లోనే.. ఢిల్లీ పోలీసులు పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఈ చర్యకు దిగారు.

'కాశ్మీర్ ఫైల్స్‌'పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నివాసం ఎదుట ఇటీవల బీజేపీ యువ విభాగం నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తజిందర్ పాల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఆప్ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్ పోలీసులు.. దర్యాప్తునకు హాజరుకావాలంటూ గతంలో పలుమార్లు తజిందర్‌కు నోటీసులు జారీ చేశారు. వాటికి స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో తజిందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10-15 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి దాడి చేశారని తజిందర్ తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, తమపై పంజాబ్ పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తజిందర్ అరెస్ట్ గురించి పంజాబ్ పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

కాగా, ఢిల్లీ పోలీసులు సూచనలతో తజిందర్ బగ్గాను తీసుకెళ్తున్న పంజాబ్ పోలీసులను కురుక్షేత్ర వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఇక్కడికి చేరుకుని తజిందర్ పాల్ సింగ్ బగ్గాను మళ్లీ ఢిల్లీకి తరలించారు. కాగా, పంజాబ్ పోలీసులు తజిందర్ బగ్గాను అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేజ్రీవాల్ పంజాబ్ పోలీసులను తన మాఫియా కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తదప్పదని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+