చిరాగ్‌పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణ

బీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపానని.. సమీకరణాలు మార్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ చిరాగ్‌తో తమ పార్టీ నేతలెవరూ సంప్రదింపులు జరపలేదని జవదేకర్ స్పష్టంచేశారు.

ప్రధాని మోడీ, అమిత్ షాను పొగిడి రాజకీయాలు చేద్దామని చిరాగ్ అనుకొంటున్నారని తెలిపారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారని గుర్తుచేశారు. దీంతో బీజేపీతో తమకు లోపాయికారి ఒప్పందం ఉంది అనే కలరింగ్ చేస్తున్నారని జవదేకర్ విరుచుకుపడ్డారు. అయితే ఎల్జేపీతో తమకు ఎలాంటి పొత్తు లేదని.. తాము జేడీయూతో కలిసి పోటీచేస్తున్నానని జవదేకర్ క్లారిటీ ఇచ్చారు. జరుగుతోన్న ప్రచారంతో కన్‌ఫ్యూజ్ కావొద్దని చెప్పారు.

BJP slams Chirag Paswan, accuses LJP of spreading confusion..

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, హెచ్ఏఎంఎస్, వికాస్ షీల్ ఇన్సాన్ పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయని జవదేకర్ తెలిపారు. కానీ ఎల్జేపీ మాత్రం ఓట్ల పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు. జవదేకర్ కాదు బీజేపీ నేత భూపేందర్ యాదవ్ కూడా చిరాగ్ పాశ్వాన్‌‌పై విరుచుకుపడ్డారు. చిరాగ్‌కు అప్పుడే అబద్దాలు చెప్పడం అలవాటైపోయిందని చెప్పారు. లేని పొత్తును ఉన్నట్టు చూడటం సరికాదని.. తీరు మార్చుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+