యడ్డీకి బిజెపి గ్రీన్‌సిగ్నల్, రెడీ: శ్రీరాములుకు ఛాన్స్

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప తిరిగి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేందుకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకుడు ఈశ్వరప్ప ఆదివారం చెప్పారు. యడ్డీకి అధిష్టానం పచ్చజెండా ఊపిందని, ఆయన త్వరలో పార్టీలోకి వస్తారని ఆకాంక్షించారు.

ఈశ్వరప్ప బళ్లారీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బిజెపి నాయకత్వం ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. పార్టీలో చేరేందుకు యడ్డీ ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు.

Yeddyurappa

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని పిఎంను చేయాలనే ఏకైక లక్ష్యంతో బిజెపిలో తిరిగి చేరుతున్నట్లు యెడ్యూరప్ప ప్రకటించారని, దాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. కాగా, సొంత గూటికి చేరనున్నట్లు యడ్డీ కూడా సూత్రప్రాయంగా ప్రకటించారు.

మరోవైపు బిఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీరాములును కూడా బిజెపిలో చేర్చుకునే అంశంపై అగ్ర నాయకత్వంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈశ్వరప్ప పేర్కొన్నారు. అయితే ఆయన చేరికపై ఇంకా ఎలాంటి సంకేతం అందలేదన్నారు. వాల్మీకి కమ్యూనిటీలో బలమైన నాయకుడుగా శ్రీరాములుకు పేరుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+