వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"ఇది మోడీ వేవ్ కాదు, ఈవీఎం వేవ్!.. ఢిల్లీ విజయం వెనుక ట్యాంపరింగ్"

'బీజేపీకి లభించిన ఈ విజయం మోడీ వేవ్ కాదు.. ఈవీఎం వేవ్' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓటు పడేలా ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఆరోపణలు చేయగా.. మాజీ సీఎం అఖిలేశ్ సహా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గొంతు కలిపారు.

ఇక తాజా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోను బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. ఆ పార్టీ విజయంపై ఆమ్ ఆద్మీ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో ఆప్ పరాభవానికి ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్లే(ఈవీఎం) కారణమని ఆ పార్టీ ఆరోపించింది. ఇదే విషయంపై ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడారు.

BJP win due to EVM ‘wave’: AAP

'బీజేపీకి లభించిన ఈ విజయం మోడీ వేవ్ కాదు.. ఈవీఎం వేవ్' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓటు పడేలా ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు. అందువల్లే బీజేపీకి ఇంతటి విజయం దక్కిందన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. కేంద్రమంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ.. ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

దేశ ప్రజలంతా బీజేపీనే బలంగా కోరుకుంటున్నారని, అదే విషయం మరోసారి రుజువైందని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, తాజా ఢిల్లీ ఎన్నికల ఫలితాల తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు తమ ఇళ్ల నుంచే పరిశీలించారు.

English summary
The AAP on Wednesday termed the BJP’s victory in the Delhi municipal polls as a result of alleged tampering of EVMs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X