నోట్ల రద్దు ఎఫెక్ట్ కనిపించలేదు!: 'మహా' మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం

మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,501 స్థానాలకు ఫలితాలు వెలువడగా.. బీజేపీ 610 సీట్లు దక్కించుకుంది.

ముంబై : నోట్ల రద్దు తరుణంలో వచ్చిన ఎన్నికలు కావడంతో.. మోడీ తీసుకున్న నిర్ణయానికి ఓ పరీక్షగా ముంబై మునిసిపల్ ఎన్నికలను పరిగణించారు. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ.. బీజేపీ సత్తా చాటింది. మొత్తం 2,501 స్థానాలకు ఫలితాలు వెలువడగా.. బీజేపీ 610 సీట్లు దక్కించుకుంది. ఇక బీజేపీ మిత్రపక్షం శివసేన 402 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్‌సీపీ) 482,కాంగ్రెస్ 408 సీట్లు దక్కించుకున్నాయి.

క్లిష్ట సమయం అనుకున్నారు గానీ..!

నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా సామాన్యులంతా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వచ్చిన ఎన్నికలు కావడంతో.. ప్రజాతీర్పుపై బీజేపీ నేతల్లో సైతం ఒకింత ఆందోళన కొనసాగింది. అయితే తాజా తీర్పుతో మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నిర్ణయానికి అనుకూలంగా ఉన్నారన్న విషయాన్ని బీజేపీ నేతలు చెబుతున్నారు.

BJP wins big in first phase; Modi say victory for demonetisation

మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ప్రజావిజయంగా అభివర్ణించారు ప్రధాని మోడీ.పేద ప్రజల ప్రయోజనాలకు బీజేపీ కట్టుబడి ఉన్నందువల్లే.. ప్రజలు పార్టీపై పూర్తి విశ్వాసం కనబర్చారని ఆయన అభిప్రాయపడ్డారు. గెలుపు కోసం కృషి చేసిన మహా సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ను, పార్టీ కార్యకర్తలను మోడీ ప్రశంసించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+