మణిపూర్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకొన్న బిజెపి
మణిపూర్ అసెంబ్లీలో బిజెపి తన బలాన్ని నిరూపించుకొంది, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కు మద్దతుగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు.
ఇంఫాల్:మణిపూర్ అసెంబ్లీలో బిజెపి బలాన్ని నిరూపించుకొంది. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఇటీవలే ఎన్ బీరేన్ సింగ్ బాధ్యతలను చేపట్టారు. మణిపూర్ రాష్ట్రంలో తొలిసారిగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకొన్నాడు బీరేన్ సింగ్. ఈ మేరకు సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో అసెంబ్లీ స్పీకర్ గా బిజెపి ఎమ్మెల్యే వై.ఖేమ్ చంద్ ను ఎన్నుకొన్నారు.

60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో 33 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి భీరేన్ సింగ్ కు మద్దతుగా నిలిచారు. బిజెపి ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎన్ పి పి, ఎన్ పి ఎప్, ఎల్ జె పి , స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బిజెపి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన శ్యామ్ కుమార్ బీరెన్ సింగ్ మంత్రివర్గంలో చేరారు.
మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలను గెలుచుకొంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొని బిజెపి మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత విశ్వాస పరీక్షను ఎదుర్కొన్న బీరేన్ సింగ్ విజయం సాధించారు.బిజెపి కేవలం 21 స్థానాలను గెలుచుకొన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇతర పార్టీల మద్దతు కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications