Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిద్దూ, డీకే, శెట్టర్ కు షాక్, నెల కాకుండానే ఎదురు దెబ్బ, టాస్క్ లేదు, తొక్కాలేదు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ ఎన్నికలో ఓడిపోయారు. ఇప్పుడు జగదీష్ శెట్టర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, డీకే శివకుమార్ కు నెల రోజుల్లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

ఇన్ని రోజులు తీవ్ర ఉత్కంఠ రేపిన హుబ్బళి-ధారవాడ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాయి. ఎట్టకేలకు బీజేపీ రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించింది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో హుబ్బళి-ధారవాడ మేయర్‌గా బీజేపీకి చెందిన వీణా భరద్వాద్, డిప్యూటీ మేయర్‌గా బీజేపీ కార్పోరేటర్ సతీష్‌ హానగల్‌ ఎన్నికయ్యారు. కార్పొరేషన్‌లో బీజేపీ మళ్లీ పట్టు సాధించడంతో పాటు కార్పొరేషన్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న కాంగ్రెస్ కల ఏమాత్రం ఫలించలేదు.

 jagadeshshetterbsyadiyarappa

మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మంత్రులు సతీష్ జారకిహోళి, సంతోష్ లాడ్ తదితరులు శతవిధాలా హుబ్బళి-ధారవాడ కార్పొరేషన్‌లో సత్తా చాటేందుకు వ్యూహం రచించారు. అయితే వీళ్ల వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు. బీజేపీ విజయంతో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు టాస్క్‌ ఇచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ బీజేపీ సభ్యులను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నందున బీజేపీ తమ పార్టీ సభ్యులందరినీ దండేలి రిసార్ట్‌కు తరలించింది. ఎన్నికల రోజు మంగళవారం దండేలి నుంచి నేరుగా ధారవాడలోని మందార హోటల్‌కు, అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్‌కు తీసుకొచ్చారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా బీజేపీ సభ్యులకు విప్ కూడా జారీ చేసింది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, పార్టీయేతర సభ్యులు కూడా మేయర్, ఉప మేయర్ ఎన్నికల సమావేశానికి హాజరయ్యారు.

సభ్యులందరూ సమావేశానికి హాజరుకావడంతో బెళగావి డివిజన్ ప్రాంతీయ ఇన్‌చార్జ్ కమిషనర్ నితీష్ పాటిలా సమావేశంలో సభ్యులు చేతులు పైకెత్తి ఓటు వేసేందుకు అనుమతించారు. 46 మంది సభ్యులు చేతులు పైకెత్తి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశారు. పూర్తి మెజారిటీ బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ఉండడంతో కమిషనర్ బీజేపీ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్లుగా ప్రకటించారు.

 dkshivakumarsiddaramaiah

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్, మహేశ్ తెంగినాకై, ప్రదీప్ షెట్టర్, ఎస్వీ సంకనూరతో పాటు బీజేపీ కార్పొరేషన్ సభ్యులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ సభ్యులు కూడా కార్పొరేషన్ కు వచ్చి పోటీ చేశారు. ఎమ్మెల్యే ప్రసాద్ అబ్బయ్య కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఓటు వేసేందుకు వచ్చారు.

చివరకు మేయర్‌గా వీణా భరద్వాద్, 22వ డిప్యూటీ మేయర్‌గా సతీష్‌ హానగల్‌ బీజేపీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు రావడంతో ఎన్నికయ్యారు. కార్పొరేషన్ అధికారం బీజేపీకి దక్కడంతో బీజేపీ కార్యకర్తలు కార్పొరేషన్ ఎదుట పటాకులు పేల్చి పరస్పరం రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అమృత దేశాయ్ కూడా కార్పొరేషన్‌కు వచ్చి కొత్త మేయర్, డిప్యూటీ మేయర్‌లను అభినందించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన జగదీష్ శెట్టర్ ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అనుకుంది. హుబ్బళి-ధారవాడ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని, అందుకు మీరు శక్తి వంచన లేకుండా పని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు చెప్పారు. అయితే కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసిన స్కెచ్ లు అన్ని తారుమారు అయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+