బిగ్ షాక్ : ఆవుల్ని తరలిస్తున్నందుకు బీజేపీ కార్యకర్త హత్య
ఉడిపి : ఇప్పటిదాకా ఆవులను తరలిస్తున్నారన్న కారణంగా.. దళితులపై దారుణాలు చోటు చోసుకోవడం తరుచూ వార్తల్లోకి ఎక్కుతూ వస్తోంది. అయితే ఇదే కారణంతో ఓ బీజేపీ కార్యకర్తపై దాడి జరగడం.. దాడిలో అతను మరణించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రవీణ్ పూజారి అనే బీజేపీ కార్యకర్త అతని స్నేహితుడు అక్షయ్ తో కలిసి రెండు ఆవులను టెంపో వాహనంలో తరలిస్తుండగా.. వీహెచ్.పీ, భజరంగ్ దళ్ కార్యకర్తల కంటపడింది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రవీణ్ పూజారిపై దారుణంగా దాడి చేశారు. దాదాపు 20 మంది భజరంగ్ దళ్, వీహెచ్.పీ కార్యకర్తలు ప్రవీణ్ పూజారి వెళ్తున్న వాహనాన్ని చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు.
కాగా, దాడిలో తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్ పూజారి మృతి చెందగా, అతని స్నేహితుడు అక్షయ్ ను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఉడిపి ఎస్పీ బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం దాడిలో పాల్గొన్న 17 మందిని అరెస్టు చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications