Milkipur By Election: ఓటమికి ప్రతీకారం.. మిల్కిపూర్ లో బీజేపీ ఘన విజయం
Milkipur By Election: ఉత్తరప్రదేశ్ లోని మిల్కిపూర్ ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ 60 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. 30 రౌండ్ల కౌంటింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ ను ఓడించారు. ఎస్పీకి చెందిన అజిత్ ప్రసాద్ ప్రారంభం నుంచి వెనుకంజలోనే ఉన్నారు. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓటమిని అంగీకరించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత అవధేష్ ప్రసాద్ మిల్కిపూర్ స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఫిబ్రవరి 5న ఉపఎన్నిక జరిగింది. గతంలో ఆ స్థానంలో ఓడిన బీజేపీ.. ఈ సారి గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.
మిల్కిపూర్ లో బీజేపీ జెండాను ఎగురవేసిన చంద్రభాను పాశ్వాన్ ఎవరో తెలుసుకుందాం. అయోధ్యలోని మిల్కిపూర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసేందుకు ఎంతో మంది ప్రముఖ నేతలకు బదులుగా చంద్రభాను పాశ్వాన్ కు బీజేపీ బాధ్యతలను అప్పగించింది. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ కుమారుడు అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. చంద్రభాను పాశ్వాన్ రుడౌలిలోని పర్సౌలి గ్రామానికి చెందినవారు. వృత్తీరీత్యా న్యాయవాది అయిన చంద్రభాను పాశ్వాన్.. అయోధ్యలోని రుడౌలి నుంచి రెండుసార్లు జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఉన్నారు.

ఈ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు మంత్రులు తీవ్రంగా ప్రచారం చేశారు. సమాజ్ వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ సహా అనేక మంది నాయకులు అజిత్ ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కానీ చివరికి బీజేపీకే విజయం దక్కింది. లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఓటమికి ప్రతీకారంగా ఈ విజయం దక్కిందని భావిస్తున్నారు.2024 లోక్ సభ ఎన్నికల్లో అవధేష్ ప్రసాద్ బీజేపీకి చెందిన లల్లూ సింగ్ ను ఓడించారు. కానీ ఇప్పుడు అయోధ్యలోని మిల్కిపూర్ స్థానంలో అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications