కేజ్రీవాల్ ను మట్టికరిపించిన పర్వేష్ వర్మ.. ఈయన గురించి తెలిస్తే షాక్..!

దిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణను తెర దించుతూ.. దేశ రాజధానిలో బీజేపీ విజయదుందుభి మోగించింది. దిల్లీ సునామీలో ఆప్ లోని అగ్రనేతలు సైతం కొట్టుకుపోయారు. ఆప్ అధినేత, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను న్యూదిల్లీ నియోజకవర్గంలో పర్వేష్ వర్మ మట్టికరిపించారు.కేజ్రీవాల్ ను ఆయన సొంత నియోజకవర్గంలోనే దెబ్బ కొట్టారు పర్వేష్ వర్మ. కేజ్రీపై 3వేల ఓట్ల తేడాతో విక్టరీ కొట్టాడు. ఈ విజయం తర్వాత పర్వేష్ వర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. జై శ్రీరామ్ అని ట్వీట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. " మోదీ దార్శనికత వల్లే ఈ విజయం సాధించాం. ఆయనకే ఈ క్రెడిట్ ఇస్తాం. బీజేపీకి అద్భుత విజయం అందించిన దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు.

పర్వేష్ నేపథ్యం ఇదే..

జాట్ సామాజిక వర్గానికి చెందిన 47 ఏళ్ల పర్వేష్ వర్మ 7 నవంబర్ 1977లో దిల్లీ లో జన్మించారు. ఈయన దిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2013 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2013లోనే మెహరౌలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. 2014-2024 వరకు పర్వేష్ వర్మ వెస్ట్ దిల్లీ ఎంపీగా సేవలు అందించారు.ప్రస్తుతం పర్వేష్ వర్మ రాష్ట్రీయ స్వాభిమాన్ అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఆయన 2002లో స్వాతీ సింగ్ ను వివాహమాడారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

BJP s Historic Victory in Delhi Polls Parvesh Verma Defeats Kejriwal Here s What You Should Know About Him

నెక్ట్స్ సీఎం పర్వేష్..?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో నెక్ట్స్ సీఎం ఎవరు ? అన్న దానిపై చర్చలు ఊపందుకున్నాయి. ఆప్ అధినేత కేజ్రీవాల్ ను మట్టికరిపించిన పర్వేష్ వర్మ నే సీఎం అభ్యర్థి అని బీజేపీ వర్గాల్లో చర్చ బలంగా వినిపిస్తోంది. మరి దిల్లీ సీఎం పగ్గాలు బీజేపీ ఎవరికి ఇస్తుందో తేలాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+