షాక్: 60కోట్ల నగదు, 245 కిలోల బంగారం సీజ్
పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో భారీ ఎత్తున అక్రమంగా మార్గాల్లో తరలుతున్న కరెన్సీతోపాటు భారీగా బంగారం బయటపడుతోంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో భారీ ఎత్తున అక్రమ మార్గాల్లో తరలుతున్న కరెన్సీతోపాటు భారీగా బంగారం బయటపడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.60కోట్ల కరెన్సీతోపాటు 245 కిలోల బంగారాన్ని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. నవంబర్ 10 నుంచి చేపట్టిన దాడుల్లో ఈ మొత్తాలు పట్టుబడ్డాయి.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నవంబర్ 15 డిసెంబర్ 6 మధ్య రూ.6.23కోట్ల నగదు, 19.409 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 8 మధ్య రూ.18.32 కోట్ల నగదు, 90.4 కిలోల బంగారం పట్టుకున్నారు.
కోల్‌కతాలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 8 మధ్యకాలంలో రూ.5.65 కోట్ల నగదు, 25.463 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. చెన్నై ఎయిర్‌పోర్టులో డిసెంబర్ 8, 9 తేదీల్లోనే రూ.6.05 కోట్ల నగదు, 109 కిలోల బంగారం సీజ్ చేశారు. గౌహతిలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 8 మధ్య రూ.69.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పాట్నా విమానాశ్రయంలో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 1 మధ్య రూ.1.33 కోట్ల నగదును పట్టుకున్నారు. అహ్మదాబాద్‌లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 4 మధ్య రూ.3.14 కోట్ల నగదు, 800 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
నాగ్‌పూర్‌లో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 2 మధ్య రూ.11 కోట్ల నగదు, దిమాపూర్ విమానాశ్రయంలో ఇదేకాలంలో రూ.3.5 కోట్ల నగదు, పుణెలో డిసెంబర్ 7 - 11 తేదీల మధ్య 4.02 కోట్లు, 11 కిలోల బంగారం పట్టివేత జరిగింది.












Click it and Unblock the Notifications