సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పక్కనే కారులో పేలుడు .. జమ్ముకాశ్మీర్ లో ఘటన

ఇంకా భయం నుండి బయట పాడనీ జమ్మూ-కశ్మీరులోని రామ్‌బన్ జిల్లాలో శనివారం ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటన స్థానికులను ఉలికిపాటుకు గురి చేసింది. బనిహాల్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ దళాల వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు . ఇక జవహర్ సొరంగం సమీపంలో శ్రీనగర్-జమ్మూ హైవేపై జరిగిన ఈ పేలుడు తో కారు తునాతునకలైంది, సీఆర్‌పీఎఫ్ బస్సు ధ్వంసమైంది.

పుల్వామా దాడి తర్వాత ఎక్కడ ఏ దాడి జరిగినా ఉగ్రదాడి అని భయపడుతున్నారు .అయితే కారు లో పేలుడు ఘటనపై బనిహాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారులో సిలిండర్ పేలింది. కారులోని సిలిండర్ లీక్ అవడంతో గ్యాస్‌ వెలువడి నిప్పు అంటుకుని ప్రమాదం జరిగింది. సీఆర్‌పీఎఫ్ వర్గాల పరిశీలన ప్రకారం కారులో సిలిండర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సీఆర్‌పీఎఫ్ వాహనాలు దూరంగా ఉండటంతో ముప్పు తప్పింది. పాక్షికంగా వాహనాలు ద్వంసం అయ్యాయి కానీ ఎవరికీ ఏమి ప్రాణాపాయం కలగలేదు.

Blast in car near soldiers convoy in Ramban on Srinagar Highway

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+