ప్రపంచానికి తెలిసేలా పాక్ పై త్రిముఖ దాడులకు బ్లూప్రింట్ సిద్ధం.. మోదీ భారీ వ్యూహం!

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులకు అండగా ఉంటున్న పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి సిద్ధమైందా? ప్రపంచదేశాలకు భారత సత్తా తెలిసేలాగా, పాకిస్తాన్ ను దెబ్బ కొట్టి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతుందా? పహల్గామ్ లో ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా పాకిస్తాన్ తోక కత్తిరించడానికి భారత్ రెడీ అయిందా? త్రివిధ దళాలతో త్రిముఖవ్యూహంతో భారత్ వడివడిగా అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.

పాకిస్తాన్ పై దాడికి బ్లూ ప్రింట్ రెడీ
పక్కా ప్లాన్ తో భారత్ యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకుంటున్న చర్యలు, వేస్తున్న అడుగులు పాకిస్తాన్ పైన భారీ దాడికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ బోర్డర్ లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటికే త్రివిధ దళాలతో సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ త్రిముఖ దాడులకు సిద్ధమయ్యారు. పాకిస్తాన్ కు ఊపిరి సలపనివ్వకుండా దాడి చేసేందుకు బ్లూ ప్రింట్ కూడా రెడీ చేస్తున్నట్టు సమాచారం.

Blueprint prepared for three-pronged attack on Pakistan to let the world know Modi big strategy

Take a Poll

అరేబియా సముద్రంలో నేవీ సిద్ధం
వారం రోజుల్లో కార్యచరణ చేపట్టి, నిర్దిష్ట చర్యలు కూడా తీసుకోవడానికి భారత్ సిద్ధమైంది .ఇక అరేబియా సముద్రంలో నేవీ సర్వ సన్నద్ధమైంది. ఎల్ ఓ సి వెంబడి ఎనిమిది చోట్ల పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడితే అక్కడ భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. ఇప్పటికే సరిహద్దుల్లో భారీ సైన్యాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించి భారత్ సిద్ధమవుతోంది.

వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్న భారత్.. మోదీ వరుస భేటీలు
పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు కూడా పాకిస్తాన్ పైన త్వరలో భారీ దాడి జరగబోతుంది అన్న సంకేతాలను ఇస్తున్నాయి. రష్యా నుంచి ఇగ్లా ఎస్ క్షిపణులను కొనుగోలు చేసి భారత్ సమరానికి సై అంటుంది. అటు ప్రధాని మోదీ వరుసగా త్రివిధ దళాధిపతులతో భేటీ అవుతూ యుద్ధ సన్నద్ధత పైన ఆరా తీస్తున్నారు. పాకిస్తాన్ తమపైన ఎదురు దాడి చేస్తే తిప్పి కొట్టేందుకు భారత్ అన్ని రకాల అస్త్ర, శాస్త్రాలతో సిద్ధమవుతోంది.

ఈ వారం కీలక నిర్ణయం
వ్యూహ, ప్రతివ్యూహాలతో త్రివిధ దళాలు పాకిస్తాన్ ను చుట్టుముట్టి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణమైనా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీ జరిగింది. ఈవారం మరో మారు సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వేగంగా మారుతున్న పరిణామాలు భారత్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుంది అన్న భావన కలిగిస్తుంది. యుద్ధమే జరిగితే భారత్ ప్రపంచానికే తమ సత్తా తెలిసేలా చెయ్యాలనే ప్లాన్ లో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+