పడవ మునిగి 38 మంది జలసమాధి

మనీలా: ప్రమాదవశాత్తు పడవ మునిగిపోవడంతో 38 మంది జలసమాధి అయిన సంఘటన ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది గల్లంతు అయ్యారు. అయితే చాల మందిని జాలర్లు, కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు.

గురువారం ఎం/బీ కిమ్ అనే సంస్థకు చెందిన పడవ ఆర్మాక్ నుండి కామోట్స్ దీవులకు బయలుదేరింది. పడవ బయలుదేరిన కొద్ది సేపటికి సముద్రంలో విపరీతమైన గాలులు, అలలు వచ్చాయి. పడవ వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది.

Boat accident 38 people killed in Philippines

భారీ అలలు రావడంతో పడవ ఒక్కసారిగా తిరగబడిపోయింది. అందులో ఉన్న వారు చాల మంది సముద్రంలో పడిపోయారు. అదే సమయంలో చేపలు పట్టడానికి వెళ్లిన జాలర్లు, కోస్టుగార్డులు విషయం గుర్తించి సంఘటనా స్థలానికి వెళ్లారు. నీటిలో మునిగిపోతున్న 127 మందిని ప్రాణాలతో కాపాడారు.

పడవలో 173 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 38 మంది మరణించారని, 26 మంది గల్లంతు అయ్యారని అధికారులు చెప్పారు. గల్లంతు అయిన వారి కోసం కోస్టుగార్డులు గాలిస్తున్నారు. గల్లంతు అయిన వారిలో సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+