నమ్మితే రూ. 58 లక్షల మోసం చేశాడు: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి ఫిర్యాదు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ భార్య, హీరో టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్.. మోసగాళ్ల వలలో చిక్కుకుని భారీ మొత్తంలో సొత్తును పోగొట్టుకున్నారు. ఎంఎంఏ మ్యాట్రిక్స్ కంపెనీ ఆపరేషన్స్ డైరెక్టర్ అలాన్ ఫెర్నాండేజ్‌పై మోసం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. టైగర్ ష్రాఫ్ జిమ్ పేరు వాడుకుని.. వివిధ టోర్నమెంట్లు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు కాజేశారన్నది నిందితుడిపై ప్రధాన ఆరోపణ.
దాదాపు రూ. 58 లక్షల మేర మోసం చేసినట్లు అయేషా ష్రాఫ్.. శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయేషా ష్రాఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420, 408, 465, 467, 468 కింద అభియోగాలు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎలాన్ ఫెర్నాండెజ్ 2018లో ఎంఎంఏ మ్యాట్రిక్స్ కంపెనీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

వాస్తవానికి ఎంఎంఏ మ్యాట్రిక్స్ కంపెనీ జిమ్ టైగర్ ష్రాఫ్ యాజమాన్యంలో ఉంది. కానీ, ఇండస్ట్రీలో అతడికి ఉన్న కమిట్మెంట్ల కారణంగా.. అతని తల్లి అయేషా జిమ్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్షల్ ఆర్ట్స్ రిక్రూట్‌మెంట్లకు శిక్షణ ఇవ్వడానికి అలాన్ రూ. 3 లక్షల వేతనానికి ఉద్యోగం చేరాడు.
అయితే, అలాన్ మాత్రం టోర్నీల నిర్వహణ ముసుగులో తప్పుడు మార్గంలో భారీగా డబ్బు కూడబెట్టాడు. టైగర్ ష్రాఫ్ జిమ్ పేరును వాడుకుని.. భారతదేశంలో మాత్రమే గాక, విదేశాలలో కూడా మొత్తం 11 టోర్నమెంట్లు నిర్వహించాడు. ఫలితంగా డిసెంబర్ 2018 నుంచి జనవరి 2023 వరకు తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో రూ. 58,53,591 జమ చేశాడు.
కాగా, ఆయేషా ష్రాఫ్ మే 3న ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఫెర్నాండెజ్‌పై మోసం, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, ఇతర నేరాల కింద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications