బాంబులు పెట్టి లేపేస్తా: నితీష్‌కు బెదిరింపు మెసేజ్

పాట్నా: బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ నేత నితీష్ కుమార్‌కు బాంబు బెదిరింపు ఓ సందేశం (ఎస్ఎంఎస్) ద్వారా వచ్చింది. నితీశ్ కుమార్‌ను బాంబు పెట్టి హతమారుస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరించాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు హిందీ వార్తా పత్రికలకు, టీవీ న్యూస్ ఛానెళ్లకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.

త్వరలోనే భారీ స్థాయిలో బాంబులు పెట్టి జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీశ్‌ను హత్య చేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం సదరు ఛానెళ్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Bomb blast threat: SMS threatens to 'eliminate' Nitish Kumar, security scaled up

ఎస్ఎంఎస్ ఆధారంగా శ్రీకృష్ణపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పాట్నా సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని చెప్పారు. వేరే రాష్ట్రం నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.

సిఎం నితీష్ కుమార్‌కు ఇప్పటికే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని చెప్పిన ఆయన.. బెదిరింపు సందేశం నేపథ్యంలో మరింత భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+