మద్యం వినియోగంలో ఆ రాష్ట్రమే టాప్.. దేశంలోనే నెం. 1

మద్యం వినియోగంలో ఆ రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోనే నెం. 1 స్థానానికి చేరింది. భారత్‌ లో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు మరోసారి టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నాయి. మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం (FY-25)లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో 58 శాతం రాబడి ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

మద్యం వినియోగంలో మరోసారి దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి. దేశవ్యాప్తంగా విస్కీ వినియోగంలో కర్ణాటక రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిందని కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్ సంస్థ తాజాగా వెల్లడించింది. మద్యం అమ్మకాల్లో 17 శాతం ఈ రాష్ట్రం నుంచే ఉన్నట్లు తేలింది. ఇక కర్ణాటక తర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి ఉంది. మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఏపీ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి. దేశవ్యాప్తంగా 40.17 కోట్ల విస్కీ కేసుల అమ్మకాలు జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లోనే 58శాతం వినియోగం ఉంది. ఈ రాష్ట్రాల్లో 23.18 కోట్ల కేసులు అమ్ముడైనట్లు తాజాగా సీఐఏబీసీ తన నివేదికలో వెల్లడించడం గమనార్హం. తెలంగాణలో 3.1 కోట్ల విస్కీ కేసులు అమ్ముడవగా.. ఆంధ్రప్రదేశ్‌ లో 3.55 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి.

Booze Boom in Bengaluru Karnataka Tops India in Alcohol Consumption

ఇక ఉత్తరాది రాష్ట్రాలను చూస్తే ఉత్తర్‌ప్రదేశ్‌ లో అత్యధికంగా 2.50 కోట్ల కేసులతో ఆరో స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌, దిల్లీ, హరియాణా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+