గుర్గావ్ తరహా ఘటన.. ఢిల్లీలో, నలుగురి జట్టు కత్తిరించారు.. ఎవరో తెలియదు!
నలుగురు కుటుంబసభ్యుల జట్టు కత్తిరించబడిన ఘటన పశ్చిమ ఢిల్లీలోని మియాపురిలో వెలుగుచూసింది. మియాపురి రామ్‌చంద్ర ప్రాంతంలో అర్థరాత్రి ఓ మహిళ సహా ఆమె ముగ్గురు కూతుళ్ల జుట్టు కత్తిరించబడి ఉంది.
న్యూఢిల్లీ: అర్ధరాత్రిళ్లు.. గుట్టు చప్పుడు కాకుండా మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఘటనలు ఇన్నాళ్లూ గుర్గావ్ లోనే అనుకున్నాం కానీ తాజాగా ఢిల్లీలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.
నలుగురు కుటుంబసభ్యుల జట్టు కత్తిరించబడిన ఘటన పశ్చిమ ఢిల్లీలోని మియాపురిలో వెలుగుచూసింది. మియాపురి రామ్‌చంద్ర ప్రాంతంలో అర్థరాత్రి ఓ మహిళ సహా ఆమె ముగ్గురు కూతుళ్ల జుట్టు కత్తిరించబడి ఉంది.

ఈ ఘటనపై బాధిత మహిళ మాట్లాడుతూ.. అర్థరాత్రి వాష్‌రూంకి వెళ్లిన సమయంలో అద్దంలో ముఖం చూసుకోగా తన జుట్టు కత్తిరించి ఉందని, తిరిగి తన బెడ్ వద్దకు వచ్చి చూడగా కత్తిరించిన జుట్టు దానిపై ఉందని తెలిపింది.
కేవలం తన జుట్టు మాత్రమే కాదని, తనతోపాటు తన ముగ్గురు కూతుళ్ల జుట్టు కూడా కత్తిరించబడి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

Click it and Unblock the Notifications