రికార్డులు బద్దలుకొట్టండి! ఓటర్లకు మోడీ పిలుపు!
Recommended Video
Lok Sabha Elections 2019 : రికార్డులు బద్దలుకొట్టండి...! ఓటర్లకు మోడీ పిలుపు! || Oneindia Telugu
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడతలో 9 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లందరూ పాల్గొనాలని ప్రధాని మోడీ కోరారు. గత మూడు దశల పోలింగ్ రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మోడీ ట్విట్టర్‌లో సందేశం ఇచ్చారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువ ఓటర్లు పోలింగ్‌లో తప్పకుండా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సైతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావాలని అన్నారు. ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు నవ భారత నిర్మాణానికి దోహదం చేస్తుందని అన్నారు.













Click it and Unblock the Notifications