Breaking : జాతీయ భాషగా సంస్కృతం- పిల్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు...

జాతీయ భాషగా సంస్కృతాన్ని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిల్ ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఇది పార్లమెంటు పరిధిలోని అంశమని, రాజ్యాంగం, విధానపరమైన మార్పులు దీనికి అవసరమని తేల్చిచెప్పింది. ఇందులో సుప్రీంకోర్టు ఏమీ చేయలేదని తెలిపింది.

ప్రస్తుతం భారత్ లో జాతీయ భాషగా హిందీ ఉంది. అయితే మిగతా భాషల్ని కూడా జాతీయ భాషలుగా ప్రకటించాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇదే క్రమంలో సంస్కృతాన్ని జాతీయ భాషగా గుర్తించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తుంటాయి. ఇదే డిమాండ్ తో సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అయితే దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. ప్రచారం కోసం దాఖలయ్యే ఇలాంటి పిటిషన్ పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

Breaking : sc dismissed PIL seeking Sanskrit be declared a national language

మీరు సంస్కృతంలో మీ ప్రార్థనను రూపొందించారని, ప్రచారం కోసం మేం ఎందుకు నోటీసు జారీ చేయాలి లేదా ప్రకటించాలని సుప్రీంకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. మేము మీ అభిప్రాయాలలో కొన్నింటిని పంచుకోవచ్చు కానీ దీనిపై చర్చించడానికి సరైన వేదిక పార్లమెంటు మాత్రమేనని సుప్రీం ధర్మాసనం తెలిపింది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరమని స్పష్టం చేసింది. కాబట్టి ఆయా మార్గాల్లో మాత్రమే మీరు సమస్యకు పరిష్కారం కనుగొనాలని పిటిషనర్ కు సూచిస్తూ పిటిషన్ ను తోసిపుచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+