కర్నాటకకు కొత్త సీఎం ? సిద్దరామయ్య రాజీనామా ? ఢిల్లీలో కీలక పరిణామాలు..!

కర్నాటకలో సీఎం మార్పుపై నెలకొన్న ఊహాగానాలు ఇవాళ మరిన్ని మలుపులు తిరిగాయి. ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం సీఎం సిద్దరామయ్య (Siddaramaiah ), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను అత్యవసరంగా ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అజెండా మాత్రం వారికి చెప్పలేదు. దీంతో సీఎం మార్పు ఉంటుందనే ఊహాగానాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం మార్పు ఊహాగానమే అని కొట్టిపారేశారు. దీంతో అంతా పుకార్లే అని అనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ బయటపడింది.

ఇవాళ ఢిల్లీలో అధిష్టానంతో జరిగిన చర్చల్లో సీఎం సిద్దరామయ్యను రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత సీఎంగా సిద్దరామయ్యకూ, డీకే శివకుమార్ కూ మధ్య పోటీ ఏర్పడినప్పుడు అధిష్టానం సిద్దూ వైపే మొగ్గు చూపింది. అయితే డీకే శివకుమార్ కు తర్వాతి దశలో సీఎంను చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆయన రెండేళ్లుగా అవకాశం వచ్చినప్పుడల్లా తనను సీఎం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు.

BREAKING Siddaramaiah to Step Down as Karnataka CM Congress Crisis Reaches Tipping Point

ఈ క్రమంలో సిద్దూతో రాజీనామా చేయించి రాజ్యసభకు పంపాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభ కు నామినేషన్ వేసేందుకు సిద్దరామయ్య ఇంకా అంగీకరించలేదని తెలుస్తోంది. . ఆయన ప్రస్తుతం తన సన్నిహిత మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్దూతో రాజీనామా చేయించి డీకే శివకుమార్ ను కొత్త ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే మరికాసేపట్లో సిద్దరామయ్య ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+