2013లో శ్రీదేవికి పద్మశ్రీ, ఎన్నో అవార్డులు: సినిమాల్లో స్టార్, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు!
దుబాయ్: తెలుగులో ఎంతోమంది అభిమానులను చూరగొని, బాలీవుడ్‌లోను స్టార్‌గా వెలిగిన శ్రీదేవి కన్నుమూశారు. 54 ఏళ్లకే చలాకీగా కనిపించే శ్రీదేవి మృతి చెందడాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. బాలీవుడ్‌లో ఫీమేల్ సూపర్ స్టార్‌గా ఎదిగారు.
Recommended Video

చదవండి: హార్ట్ ఎటాక్‌తో దుబాయ్‌లో 'అతిలోక సుందరి' శ్రీదేవి కన్నుమూత
బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహం నిమిత్తం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ కపూర్‌తో కలిసి ఆమె దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆమెకు హఠాత్తుగా గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. శ్రీదేవి అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందారు. ఈ విషయాన్ని సంజయ్ కపూర్ ధ్రవీకరించారు.

1963లో జననం
శ్రీదేవి 13 ఆగస్ట్ 1963వ తేదీన శివకాశిలో జన్మించారు. ఆమె అసలు పేరు అమ్మయ్యంగార్ అయ్యప్పన్. బాలనటిగా కందన్ కరుణ్ సినిమాతో 1967లో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం.. పలు భాషా సినిమాల్లో నటించారు.

రెండు తరాల హీరోలతో నటించారు
1976లో బాలచందర్ దర్శక్వం వహించిన మాండ్రు ముడిచులో కమల్ హాసన్, రజనీకాంత్‌లతో కలిసి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. 1975-85 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె నెంబర్ వన్‌గా ఎదిగారు. రెండు తరాల హీరోలతో నటించిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు.

2013లో పద్మశ్రీ
తెలుగులో పదహారేళ్ల వయస్సు సినిమాతో హీరోయిన్‌గా అలరించారు. 1996లో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో శ్రీదేవి పెళ్లి జరిగింది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇప్పటి వరకు 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు శ్రీదేవి. 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది.

అతిలోక సుందరి
ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళంలో పులి చిత్రంలో నటించింది. చివరి చిత్రం 217లో మామ్. చిరంజీవితో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సూపర్ డూపర్ హిట్ కావడం, ఆందులో ఆమె నటన అద్భుతంగా ఉండటంతో ఇప్పటికి అతిలోక సుందరిగా పిలుస్తుంటారు.

వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు
సినిమాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న శ్రీదేవి వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. శ్రీదేవికి చిన్నప్పటి నుంచి తల్లితో అనుబంధం ఎక్కువ. తల్లి మృతి తర్వాత ఆమె బోనీ కపూర్‌ను 1996 జూన్ 2న పెళ్లి చేసుకున్నారు.

తల్లి మృతితో షూటింగ్ నుంచి వెళ్లిపోయిన జాన్వీ
హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో ఆమె కన్నుమూసినట్లు తెలిపారు. దడాక్ చిత్ర షూటింగ్ కారణంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఈ పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది. విషయం తెలియడంతో శ్రీదేవి బంధువులు, సన్నిహితులు, మిత్రులు, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకున్నారు. జాన్వీ కూడా షూటింగ్ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications