ప్యాంట్లతోనే బయటికి రావాలి: ఆర్ఎస్ఎస్‌కు తేల్చి చెప్పిన హైకోర్టు
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల డ్రెస్ కోడ్ మరోసారి వార్తల్లో నిలిచింది. తమిళనాడులో నిర్వహించ తలపెట్టిన విజయదశమి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు ప్యాంట్లు ధరించి పాల్గొనాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. వారు నిక్కర్లు వేసుకొని కవాతు చేయకూడదని స్పష్టం చేసింది
కాగా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఖాకీ నిక్కరు, తెల్లచొక్కా వేసుకోవడం ఎప్పటి నుందో రివాజుగా వస్తోంది. ఇటీవలే ఖాకీ నిక్కరు స్థానంలో ఫుల్ ప్యాంటును వేసుకోవాలని ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది. కానీ, చెన్నై పట్టణ పోలీసు చట్టం ప్రకారం సాయుధ బలగాలు వినియోగించే యూనిఫారాలను ఇతరులు వేసుకోవడంపై నిషేధం ఉంది.

ఆర్‌ఎస్‌ఎస్ యూనిఫాం కూడా సాయుధ బలగాలు శిక్షణ సమయంలో వేసుకునే యూనిఫారాలకు చాలా దగ్గరి పోలికగా ఉన్నాయి. దీంతో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులు కూడా ధీటుగా స్పందించారు.
ఏఐఏడీఎంకే, డీఎంకేలు ఆర్‌ఎస్‌ఎస్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాగా, ఇటీవల మార్చుకున్న ఆర్ఎస్ఎస్ యూనిఫాంలో తెల్లచొక్కా, ముదురు రంగు ఖాకీ ఫ్యాంటు, బ్లాక్ క్యాప్, కాన్వాస్ బెల్ట్, ముదరు రంగు బ్రౌన్ సాక్స్, నల్లబూట్లు, వెదురు కర్రను కొత్త యూనిఫాంగా ప్రకటించింది. దీన్ని ఈ దసరా నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనుంది.












Click it and Unblock the Notifications