బెంగుళూరు వీధుల్లో బ్రిట‌న్ ప్ర‌ధాని భార్య‌... వీరి సింప్లిసిటికి ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..

బ్రిట‌న్‌ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి తన కుటుంబంతో క‌లిసి బెంగళూరు వీధుల్లో క‌నిపించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే బ్రిట‌న్ ప్ర‌థ‌మ మ‌హిళ బెంగుళూరు రోడ్ల‌పై క‌నిపించారు. అక్షత మూర్తి తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తి, ఇద్దరు కుమార్తెలు అనౌష్క, కృష్ణతో కలిసి బెంగుళూరు నగరంలోని రాఘవేంద్ర మఠాన్ని ఆమె సందర్శించారు.

ఇన్ఫోసిస్ సంస్థ వ్యవ‌స్థాప‌కుడు నారాయ‌ణ‌మూర్తి, సుధామూర్తిల గురించి తెలియ‌ని వారుండ‌రు. వీరు ఎంతో విజయవంతంగా ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థను నడుపుతున్నప్పటికీ ఎప్పుడూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉండ‌డం మ‌నం చూస్తునే ఉన్నారు. ఇక వీరి కూతురు అక్షత మూర్తి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఈమె బ్రిట‌న్ దేశానికి ప్రథమ మహిళ అయినప్పటికీ ఎంతో సాదాసీదాగా ఉంటారు. దీనికి నిద‌ర్శ‌న‌మే వీరి బెంగుళూరు ప‌ర్య‌ట‌న‌. అక్షత మూర్తి తాజాగా కుటుంబంతో క‌లిసి బెంగుళూరు రోడ్ల‌పై క‌నిపించారు.

British Prime Ministers wife on the streets of Bangalore... Netizens are falling in love with her simplicity..

అది కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే. ఈమె త‌న ఇద్ద‌రు కుమార్తెలు అనౌష్క, కృష్ణ, తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తిల‌తో కలిసి బెంగుళూరు నగరంలోని రాఘవేంద్ర మఠాన్ని సందర్శించారు. అంత‌టితో ఆగ‌కుండా బెంగుళూరు రోడ్ల‌పై కూడా షాపింగ్ చేశారు. వీరంతా ఆ స‌మ‌యంలో ఎలాంటి భద్రత లేకుండా సాధారణ పౌరుల్లా బెంగుళూరు వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టారు. అయితే, వీరిని చూసిన కొందరు వారిని ఫోటోలు, వీడియోలు తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కాస్త ఇప్ప‌డు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇటీవ‌లే ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో క‌నిపించిన బ్రిట‌న్ ప్ర‌థ‌మ మ‌హిళ‌...

సోష‌ల్‌మీడియాలోని ఈ ఫోటోల‌ను, వీడియోల‌ను చూసిన ప‌లువురు నెటిజ‌న్లు ఈ విధంగా కామెంట్లు చేశారు. బ్రిట‌న్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి, త‌న కుటుంబంతో క‌ల‌సి బెంగళూరులోని రాఘవేంద్ర మఠం వద్ద కనిపించారు. ఆమె అక్క‌డ ఎటువంటి సెక్యురిటీ లేకుండానే ఉన్నారు. ఇది వారి సాదాసీదాకు నిదర్శనమ‌నిని కొంద‌రు పేర్కొన్నారు.

వీడియో చూసిన మ‌రికొంద‌రు నెటిజ‌న్ల మాత్రం వారి సింప్లిసిటికి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బ్రిట‌న్ ప్ర‌థ‌మ మ‌హిళ అక్షత మూర్తి ఇటీవలే తన తండ్రి నారాయణమూర్తితో కలిసి బెంగళూరులోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు వెళ్లిన విషయం కూడా విదిత‌మే. కార్నర్ హౌజ్ హోటల్‌లో వీరిద్ద‌రూ ఐస్‌క్రీమ్ తిన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా అప్ప‌డు సోష‌ల్‌మీడియాలో తెగ చక్క‌ర్లు కొట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+