7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?
లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ- ఎస్పీ కూటమి కోసం 7 సీట్లు వదిలేస్తున్నామన్న కాంగ్రెస్ ప్రకటనను ఖండించారు. 80 స్థానాల్లో మీ అభ్యర్థులనే దించుకోండంటూ చురకలు అంటించారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం తమ కూటమికి ఉందని చెప్పుకొచ్చారు. 7 సీట్లు తమకు వదిలేస్తున్నామంటూ కాంగ్రెస్ చెప్పుకోవడం తగదని, అలాంటి ప్రచారం మానుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు మాయావతి.

దేశవ్యాప్తంగా పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీతో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దని మరో ట్వీట్ లో కోరారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, ఆర్ఎల్డీతో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. అయితే ఈ మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగమవుతోందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చాలాసార్లు చెప్పుకొచ్చారు.
అందులోభాగంగా అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేశామన్నారు. ఆ క్రమంలోనే అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీఎస్పీ - ఎస్పీ కూటమికి 7 సీట్లు వదిలేస్తున్నామంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు లేవు, గిత్తులు లేవంటూ మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరు చర్చానీయాంశమైంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications