వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీఎస్పీలో టికెట్ల లొల్లి.. బోరున ఏడ్చిన నేత.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి....

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నియోజకవర్గాల్లో బ‌రిలోకి దింపే త‌మ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల మొదటి నుంచి అనుకున్న అభ్యర్థులకు కాకుండా కొత్త వారికి టికెట్స్ కేటాయిస్తున్నారు. దీంతో ఆయా పార్టీలలో నేతలు అలకబూనుతున్నారు. అయితే పార్టీ టికెట్ ఇవ్వకుండా తనను పక్కన పెట్టారంటూ.. బీఎస్పీనేత బోరున బోరున ఏడ్చారు. అంతటితో ఆగకుండా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు .

 టికెట్ వస్తుంద‌న్న‌ కొండంత ఆశతో

టికెట్ వస్తుంద‌న్న‌ కొండంత ఆశతో


యూపీలోని బహుజన పార్టీ నేత అర్షద్ రాణా ముజఫర్‌నగర్‌లోని చార్తావాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దధేడు గ్రామానికి చెందిన ఆయన ఈ చార్తావాల్ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పార్టీ కోసం చాలా ఖర్చుపెట్టానే. టికెట్ విషయంపై పార్టీలో సినీయర్ నేతలకు మనసులో మాటల చెప్పారు. ఆయన భార్య కూడా బీఎస్పీ నుంచి జిల్లా పంచాయతీ మెంబర పదవికి పోటీ చేశారు. తనకు అసెంబ్లీ టికెట్ వస్తుంద‌న్న‌ కొండంత ఆశతో ప్రచారం చేసుకున్నారు అర్షద్ రాణా.

 అర్షద్ రాణా ఆశలను నీరు కార్చిన‌ అధిష్టానం

అర్షద్ రాణా ఆశలను నీరు కార్చిన‌ అధిష్టానం

అయితే అర్షద్ రాణా ఆశలను బీఎస్పీ అధిష్టానం నీరు కార్చింది. చార్తావాల్ అసెంబ్లీ టికెట్ సల్మాన్ సయీద్‌కు కేటాయిస్తున్నట్లు బీఎస్పీ అధినేత్ర మాయావతి ట్వీట్ చేశారు. బీఎస్పీ కార్యకర్తలు ఆయన గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హోం శాఖ మాజీ రాష్ట్ర మంత్రి సయీదుజ్జమాన్ కుమారుడై సల్మాన్ సయిద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఇనాళ్లు తన కష్టం బూడిదలో పోయిన పన్నీరులా మారిందంటూ అర్షద్ రాణా ఆవేదన వ్యక్తం చేశారు.

బోరున ఏడ్చిన అర్షద్ రాణా

తన మద్దతుదారులతో కలిసి కొత్వాలి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. తన ఆవేదనను వెళ్లబుచ్చాతూ బోరున ఏడ్చారు. రెండు సంవత్సరాల క్రితం పార్టీలోని ఓ సీనియర్ నేత తన వద్ద టికెట్ కోసం రూ.67 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు తనకు టికెట్ నిరాకరించి వేరేవాళ్లకు ఇచ్చారని కన్నీళ్లు పెట్టకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కోసం లక్షలు ఖర్చుపెట్టుకున్నాన‌ని పోలీసులు ఫిర్యాదు చేశారు. తనకు టికెట్ కేటాయించనందుకు తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని పార్టీ నాయకులను డిమాండ్ చేశారు అర్షద్ రాణా. సదరు బీఎస్పీ నేతలపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

English summary
BJP Leader weeping bitterly in the police station due to not getting the ticket of the assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X