యడ్యూరప్ప అసమర్థ సీఎం, మోడీ హెడ్మాస్టర్ కాదు, టీవీల ముందుకొస్తే ఏం లాభం?: సిద్దరామయ్య

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో యడ్యూరప్ప విఫలమయ్యారని, ప్రధాని మోడీ మీడియా ముందుకు ఎందుకు వచ్చి వెళుతున్నారో తెలియడం లేదని విమర్శించారు.

దేశంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కరోనా విజృంభణతో సీఎం చేతులెత్తేశారని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ప్రధాని మోడీ సాయం కోరుతున్నారని చెప్పారు. అయితే, అసమర్థుడైన ముఖ్యమంత్రితో ప్రధాని మాత్రం ఏం పనిచేయించగలడని సిద్దరామయ్య విమర్శించారు.

రాష్ట్రంలో ప్రతి రోజూ 15వేల కంటే ఎక్కువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, అయితే, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వారికి చికిత్స అందించేందుకు సరిపోయే బెడ్లు కూడా లేవని ఆరోపించారు. ఈ విషయాన్ని ఈ ముఖ్యమంత్రి.. ప్రధానికి ఎలా చెప్పగలడు అని సిద్దరామయ్య ప్రశ్నించారు.రాష్ట్రంలో వందలాది మంది కరోనా రోగులు ఆస్పత్రుల ముందు బెడ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. వారంతా ఏం చేయాలని ప్రశ్నించారు.

BSY inefficient, PM Modi not a headmaster, says Siddaramaiah

కర్ణాటక రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందని.. ప్రధాని రాష్ట్రానికి ఆక్సిజన్‌ను పెద్ద మొత్తంలో అందించాలని సిద్దరామయ్యా కోరారు. టీవీల ముందు పదే పదే కనబడితే కరోనా పోదని.. ఏమైనా చేయాలని ప్రధానికి చురకలంటించారు. అంతేగాక, మీరేం హెడ్‌మాస్టర్ కాదు.. ముఖ్యమంత్రులకు పాఠాలు చెప్పడానికి అని విమర్శించారు. బాధ్యతగా వ్యవహరించి రాష్ట్రాలకు తగినవిధంగా సహకారం అందించాలని కోరారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రజలకు ఆస్పత్రుల్లో చేర్పించడం, ఆక్సిజన్, మెడిసిన్స్, అంబులెన్స్, ఇతర అవసరాలను అందించాలని సిద్దరామయ్య కోరారు. కరోనా మహమ్మారి కారణంగా నిరుద్యోగం పెరిగిపోయిందని, ఈ క్రమంలో ప్రతి ఇంటికి రూ. 25వేలు సాయంగా అందించాలని మరో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. ఇది కరోనా సెకండ్ వేవ్ కాదని.. యడ్యూరప్ప వేవ్ లేదా మోడీ వేవ్ అంటూ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+