వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Budget 2020: మేరా వతనో జవానోంకే.. కశ్మీర్ కవి కవితను చదివిన నిర్మలా సీతారామన్

|
Google Oneindia TeluguNews

రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కవితలు వినిపించారు. తమిళంతోపాటు హిందీలో కూడా కవితను చదివారు. ప్రముఖ కశ్మీర్ కవి పండిత్ 'దీనానథ్ కౌల్' నా మాతృభూమి కవితను చదివారు. తన దేశం ఎలా ఉంటో.. ఉంటుందోనని చెప్పి కవితను చదివారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

వికసించే పువ్వు..

వికసించే పువ్వు..

ఈ పద్యం కశ్మీర్‌లోని షాలిమార్ బాగ్, దాల్ సరస్సు సూచిస్తూ.. దేశం ప్రతీ ఒక్కరిదని చెబుతోంది.‘మేరా వతన్ నో జవానోంకే గరమ్ ఖూంజ్ జస- నా దేశం వికసించే షాలిమార్ బాగ్ లాంటిదని, దాల్ సరస్సులో వికసించే కమలం పువ్వులాంటిదని చెప్పారు. ఇది యువత వేడి రక్తం లాంటిదని పేర్కొన్నారు. నా దేశం, నా దేశం, మీ దేశం మనదేశం అందరికంటే ప్రియమైనది అని' నిర్మలా సీతారామన్ చదివి వినిపించారు. నిర్మలా కవిత చదువుతున్నంత సేపు సభ్యులు బల్లచరిచి అభినందిస్తూనే ఉన్నారు.

ప్రియమైన దేశం కోసం

కవితలోని పదాల గురించి వివరిస్తూ.. ప్రభుత్వం చేసే, చేయాల్సిన ప్రతిదీ తన ప్రియమైన దేశం కోసమేనని స్పష్టంచేశారు. బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ మూడు విభాగాలు అని తెలియజేశారు. భారతదేశం యొక్క ఆకాంక్ష, అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి, సమాజ సంరక్షణగా అభివర్ణించారు. 2014-2019 వరకు ప్రాథమికంగా సంస్కరణలు అమలు చేసి వృద్ధి సాధించామని వివరించారు.

జీఎస్టీతో మేలు

జీఎస్టీతో మేలు

గూడ్స్ అంటే సర్వీస్ ట్యాక్స్ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక సంస్కరణగా అభివర్ణించారు. జీఎస్టీతో సగటు మధ్య తరగతి ప్రజలు 4 శాతం ఖర్చు తగ్గించుకోగలిగారని పేర్కొన్నారు. దీంతో వేతనజీవికి ఊరట కలిగిందని వివరించారు.

జైట్లీకి నివాళి

జైట్లీకి నివాళి


బడ్జెట్ చదివే సమయంలో నిర్మలా సీతారామన్ దివంగత నేత అరుణ్ జైట్లీకి నివాళులర్పించారు. నిర్మలా సీతారామన్ గురువు జైట్లీ.. ఆయన సూచనమేరకు మోడీ నిర్మలా సీతారామన్‌కు ఆర్థికమంత్రి పదవీ కట్టబెట్టారు. జైట్లీ ముందుచూపుతూనే సంస్కరణలు అమలు చేశామని పేర్కొన్నారు. చారిత్రాత్మకమైన జీఎస్టీని ప్రతిపాదించింది కూడా జైట్లీ అని గుర్తుచేశారు.

English summary
Budget 2020: Nirmala Sitharaman quotes Kashmiri poet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X