పసిడి ధరల్లో భారీ పురోగమనం

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 15,037 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్లు గ్రాముకు రూ. 13,784 పలుకుతోంది. వెండి ధర కిలో రూ. 2,55,100 వద్ద నమోదైంది. అంతర్జాతీయంగా కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, దేశీయంగా పసిడి, వెండి ధరలు కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోన్నాయి. ప్రస్తుతానికి వీటి ధరలు పెద్దగా పెరగట్లేదు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ఫ్యూచర్స్ రూ. 1,51,363 వద్ద స్థిరపడగా, వెండి 0.49 శాతం పెరిగి రూ. 2,47,500కి చేరుకుంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,50,420 రూపాయల వద్ద నిలిచింది. 22 క్యారెట్ల రూ. 1,37,990 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 150,370, 22 క్యారెట్లు రూ. 1,37,840గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్లు రూ. 1,51,850, 22 క్యారెట్లు 1,39,190, కోల్‌కాతాలో 24 క్యారెట్లు రూ. 1,50,370, 22 క్యారెట్లు రూ. 1,37,804 వద్ద స్థిరపడింది. దేశీయంగా బంగారం ధరలను అంతర్జాతీయ బులియన్ రేట్లు, రూపాయి-డాలర్ కదలికలు, దిగుమతి సుంకం, కాలానుగుణ ఆభరణాల డిమాండ్ ప్రభావితం చేస్తాయి.

Gold Rates Takes Up slightly at MCX in India 24K 22K and 18K at spot market and Silver Uptick

కొన్ని ప్రాంతాలలో వివాహాలు, పండుగల సీజన్ దగ్గరపడుతుండటంతో, రిటైల్ డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. వెండి దాని దీర్ఘకాలిక సగటు ధరలతో పోలిస్తే ఇప్పటికీ అధికంగానే ఉంటోంది. దీనికి పారిశ్రామిక డిమాండ్, పెట్టుబడి కొనుగోళ్లు ప్రధాన కారణాలు. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ. 2,55,100 వద్ద ఉండగా, ముంబైలో కూడా దాదాపుగా అదే రేటు వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రూ. 2,64,900కు పెరిగింది. కోల్‌కాతాలో దీని ధర 2,55,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,273, 22 క్యారెట్లు - రూ. 14,000, 18 క్యారెట్లు - రూ. 11,680

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,093, 22 క్యారెట్లు- రూ. 13,835, 18 క్యారెట్లు - రూ. 11,300

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+