Budget 2024: బడ్జెట్ లోనూ మాల్గీవులకు షాకిచ్చిన కేంద్రం..!

మన దేశానికి పొరుగునే ఉంటూ మనపై విషం చిమ్ముతున్న మాల్దీవులకు కేంద్రం మరో షాకిచ్చింది. ప్రధాని మోడీ లక్షద్వీప్ టూర్ పై విమర్శలు గుప్పించడంతో మొదలుపెట్టి చైనాతో స్నేహం పెంచుకుంటున్న మాల్దీవులకు ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ షాకిచ్చింది. భారత్ తో పెట్టుకుని ఇప్పటికే పర్యాటకం సహా పలు విధాలుగా నష్టపోతున్న మాల్దీవులకు కేంద్రం నిర్ణయం మరింత ఇబ్బందికరంగా మారబోతోంది.

ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి తీసుకున్న నిర్ణయాల్లో మాల్దీవులకు షాకిచ్చారు. ఏటా విదేశాలకు ఇచ్చే గ్రాంట్లలో మాల్దీవులకు 22 శాతం కోత విధించాలని నిర్ణయించారు. మాల్దీవుల అభివృద్ధి సహాయం కోసం ఈసారి కేంద్రం రూ.600 కోట్లు కేటాయించింది. ఇది విదేశాలకు భారత ప్రభుత్వం చేస్తున్న మూడో అతిపెద్ద సాయం.

Budget 2024: Indias shocker to Maldives, cut grants and allocated to other countries

2023-24లో మాల్దీవులకు భారత్ రూ.770.90 కోట్ల గ్రాంట్ అందించింది. 2022-23లో మంజూరు చేసిన రూ.183.16 కోట్లతో పోలిస్తే ఇది 300 శాతం పెరిగింది. వాస్తవానికి 2023 బడ్జెట్‌లో మాల్దీవుల కోసం ప్రభుత్వం మొదట రూ.400 కోట్లు కేటాయించింది. తర్వాత దానిని రూ.770.90 కోట్లకు పెంచింది. ఈసారి దాన్ని 22 శాతం తగ్గించి రూ.600 కోట్లకు పరిమితం చేసింది. గత కొన్నేళ్లుగా భారతదేశం మాల్దీవులకు ప్రధాన గ్రాంట్ల సాయందారుగా ఉంది. మాల్దీవుల్లో రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం భారత్ ఈ సాయం చేస్తోంది.

అయితే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విదేశాలకు అందించే మొత్తం సహాయాన్ని కూడా ప్రభుత్వం 10 శాతం తగ్గించింది. భారతదేశం 2024-25 కోసం విదేశాలకు గ్రాంట్ రూపంలో రూ. 4883.56 కోట్లు కేటాయించింది. ఇది 2023-24లో కేటాయించిన 5426.78 కోట్లతో పోలిస్తే తక్కువే. అయితే కేంద్రం విదేశాలకు ఇస్తున్న గ్రాంట్‌లో భూటాన్, నేపాల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే కేటాయింపులు తగ్గిన ఇతర దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. అటు శ్రీలంక, ఆఫ్రికా దేశాలు, మారిషస్, సీషెల్స్‌లకు మాత్రం కేటాయింపులు పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+