Budget 2026: బడ్జెట్ లో స్కూళ్లకు బంపర్ న్యూస్..! పిల్లలకు పండగే...!
దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్ధులకు కేంద్ర బడ్జెట్ (budget 2026)లో అదిరిపోయే న్యూస్ అందింది. 140 కోట్ల పౌరులున్న దేశంలో సృజనాత్మ నైపుణ్యాలు లేవని బాధపడుతున్న వారికి ఊరటనిచ్చేలా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. దేశంలోని 15 వేల స్కూళ్లలో విద్యార్ధులకు సృజనాత్మక నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది నిజంగానే విద్యార్ధులకు గొప్ప వరంగా మారబోతోంది.
దేశంలో సృజనాత్మక, డిజైన్ పరిశ్రమలను బలోపేతం చేయడానికి ఆర్థికమంత్రి బడ్జెట్ లో కీలక ప్రకటన చేశారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగానికి 2030 నాటికి 2 మిలియన్ల నిపుణులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 15వేల సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలలలో AVGC కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లను స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ మద్దతుతో ఈ ల్యాబ్‌లు విద్యార్థులలో సృజనాత్మకత, డిజిటల్ స్టోరీ టెల్లింగ్, అధునాతన మీడియా నైపుణ్యాలను పెంపొందిస్తారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయడమే వీటి లక్ష్యం.

డిజైనింగ్ పరిశ్రమలోనూ శిక్షణ పొందిన నిపుణుల కొరత ఉందని ఆర్థికమంత్రి తెలిపారు. శిక్షణ పొందిన డిజైనర్ల కొరతను తీర్చానికి ఛాలెంజ్ రూట్ ద్వారా తూర్పు భారతంలో కొత్త నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సంస్థ డిజైన్ విద్యను బలోపేతం చేస్తుందన్నారు. అలాగే ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. అలాగే డిజైన్ రంగంలో నిపుణుల అవకాశాలను పెంచుతుందన్నారు.












Click it and Unblock the Notifications