Budget 2026: బడ్జెట్ ముందు ప్రధాని మోదీ అదిరిపోయే హింట్!

Budget 2026: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించగా.. గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న 'రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్' (సంస్కరణ, పనితీరు, మార్పు) విధానాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. భారత్ ఇప్పుడు 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్' మీద ప్రయాణిస్తోందని.. అభివృద్ధి పథంలో దేశం వేగంగా దూసుకుపోతోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

2047 లక్ష్యం దిశగా అడుగులు
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ప్రాముఖ్యతను వివరిస్తూ.. 21వ శతాబ్దంలో మొదటి పావు భాగం ముగిసిందని, ఇప్పుడు రెండో పావు భాగం ప్రారంభమైందని ప్రధాని గుర్తు చేశారు. 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకమని, ఆ దిశగా ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడి, శాశ్వత పరిష్కారాల మార్గంలో భారత్ బలోపేతం అవుతోందని మోదీ వివరించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మానవతా దృక్పథంతోనే ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు.

budget 2026 PM Narendra Modi Hails Reform Express Nirmala Sitharaman to Set Record with 9th Budget

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు
ఈ బడ్జెట్ సమావేశాలు ఓ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతున్నాయని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించబోతున్నారని ఆయన కొనియాడారు. ఫిబ్రవరి 1న ఆమె 2026 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు, నేడు (జనవరి 29) ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు. ఈ సర్వే దేశ ఆర్థిక స్థితిగతులపై పూర్తి స్థాయి చిత్రాన్ని అందిస్తుందని ప్రధాని తెలిపారు.

భారత్-EU డీల్: తయారీదారులకు పిలుపు
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2026 ఏడాది ఒక సానుకూల అంశంతో ప్రారంభమైందని, ఈ ఒప్పందం దేశ తయారీదారులకు ఓ గొప్ప అవకాశమని ఆయన అన్నారు. కేవలం మార్కెట్ దొరికింది కదా అని తక్కువ ధరకు వస్తువులను పంపడం కాకుండా, నాణ్యతపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. "అత్యుత్తమ నాణ్యతతో ఐరోపాలోని 27 దేశాల మనసు గెలుచుకోవాలి" అని ఆయన ఉత్పత్తిదారులకు పిలుపునిచ్చారు. ఇది ఉత్పాదక భారత్ దిశగా ఒక పెద్ద అడుగు అని ఆయన అభివర్ణించారు.

విపక్షాల డిమాండ్లు.. ప్రభుత్వ స్పందన
మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా వీబీ జీ రామ్ జీ బిల్లు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వంటి అంశాలపై చర్చించాలని వారు కోరారు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. ఈ అంశాలు ఇప్పటికే శీతాకాల సమావేశాల్లో చర్చకు వచ్చాయని.. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో వీటిపై చర్చ ఉండదని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల దృష్ట్యా సభ్యులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాష్ట్రపతి వ్యక్తం చేసిన ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రధాని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+