Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fake Currency: ఆ కరెన్సీ నోట్లతో రూ.1.3 కోట్లు మోసం.. బంగారు షాపోడినే బురిడీ కొట్టిచార్..

Anupam Kher Currency notes: రోజురోజుకూ మోసాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఎక్కువగా ఆన్ లైన్ మోసాలు జరుగుతున్న నేటి కాలంలో ఇంకా ఫిజికల్ మోసాల హవా కూడా కొనసాగుతోందని వెల్లడైంది. అయితే ఇవి వేలల్లో లక్షల్లో కాకుండా ఏకంగా కోట్లలో జరుగుతున్నట్లు వెల్లడైంది.

తాజాగా గుజరాత్ అహ్మదాబాదుకు చెందిన ఒక బంగారు వ్యాపారిని మోసగాళ్లు టార్గెట్ చేశారు. సదరు ట్రేడర్ నుంచి రూ.1.3 కోట్లు విలువైన 2 కేజీల బంగారం కొనుగోలు చేశారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సదరు మోసగాళ్లు వ్యాపారికి బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫొటో ప్రింట్ చేసిన నకిలీ కరెన్సీ నోట్లను తనకు అందించినట్లు మెహుల్ ఠక్కర్ అనే ట్రేడర్ వాపోయాడు. తాను బంగారం, వెండి ట్రేడ్ చేస్తున్నట్లు సదరు వ్యాపారి పేర్కొన్నాడు. వాస్తవానికి సెప్టెంబర్ 23న తనకు తెలిసిన లక్ష్మీ జ్యూవెలర్స్ అనే సంస్థ మేనేజర్ తనకు తెలిసిన వ్యక్తులకు 2 కేజీల బంగారం కావాలంటూ కాల్ చేశాడని, సదరు మేనేజర్ తనకు తెలుసునని మోసపోయిన వ్యాపారి వెల్లడించాడు.

Bullion trader in Ahmedabad duped for 1 3 crores with fake currency notes

లక్ష్మీ జ్యూవెలర్స్ సంస్థతో తాను దాదాపు 15 ఏళ్లుగా వ్యాపారం కొనసాగిస్తున్నాన్ని, అందుకే నమ్మకంగా రూ.1.6 కోట్లకు డీల్ ఒప్పుకున్నట్లు వ్యాపారి పేర్కొన్నాడు. సెప్టెంబర్ 24న అర్జెంటుగా గోల్డ్ కావాలని సదరు మేనేజర్ తనను అడిగాడని అయితే టెక్నికల్ కారణాలతో ఆర్టీజీఎస్ పనిచేయకపోవటంతో సెక్యూరిటీ డిపాజిట్ రూపంతో కొంత డబ్బు చెల్లించి మిగిలిన మెుత్తాన్ని తర్వాత చెల్లిస్తామని నమ్మబలికినట్లు చెప్పాడు. బంగారాన్ని డెలివరీ చేయడానికి ఠక్కర్ తన ఉద్యోగిలో ఒకరిని పంపాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరు కరెన్సీ లెక్కింపు యంత్రాన్ని ఉపయోగిస్తున్నారని చెప్పాడు.

అయితే బంగారం అప్పగించిన తర్వాత ఠక్కర్ ఉద్యోగి అందుకున్న సెక్యూరిటీ డిపాజిట్ నోట్లను తనిఖీ చేయగా రూ.1.3 కోట్లు నకిలీ నోట్లను దుండగులు తమకు ఇచ్చారని గ్రహించాడు. నోట్లపై గాంధీ బొమ్మకి బదులుగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి బదులుగా "స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా" స్టాంప్‌తో నోట్ల కట్టలు ఉన్నట్లు సదరు ఉద్యోగి గ్రహించాడు. స్కామ్‌ను తెలుసుకున్న ఠక్కర్, లక్ష్మీ జ్యువెలర్స్ మేనేజర్ ప్రదేశానికి చేరుకున్నారు. అంగాడియా సంస్థ అని పిలవబడే సంస్థ రెండు రోజుల క్రితం స్థాపించబడిందని వారు గుర్తించారు. లక్ష్మీ జ్యువెలర్స్ ఖాతాలో సంప్రదించిన వ్యక్తికి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేడ్ వివరాలను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+