మీషో ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 9రోజులు వేతనంతో కూడిన సెలవులు..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో (Meesho) ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మెగా బ్లాక్ బాస్టర్ సేల్ తర్వాత మీషో ఉద్యోగులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులకు మొత్తం తొమ్మిది రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మీషోలో పనిచేసే సిబ్బంది విశ్రాంతి తీసుకొని రీఛార్జ్ అయ్యేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో ప్రకటించింది. వరుసగా నాలుగో ఏడాది ఈ తరహా బ్రేక్ ఇస్తున్నట్లు మీషో పేర్కొంది.
''తొమ్మిది రోజులపాటు ల్యాప్‌టాప్స్ ఉండవు. సంస్థ నుంచి ఎటువంటి ఈ మెయిల్స్ రావు. స్టాండప్ కాల్స్ ఉండవు. ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదు. ఈ 'రెస్ట్ అండ్ రీఛార్జ్' బ్రేక్ ఈ నెల (అక్టోబర్) 26 నుంచి నవంబర్ మూడు వరకు ఉంటుందని మీషో పేర్కొంది. మా మెగా బ్లాక్‌బస్టర్ సేల్ అనంతరం పూర్తిగా రెస్ట్ తీసుకొని, మాపై మేం దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్'' అని మీషో సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఉద్యోగులకు ఇటువంటి ఆఫర్ ఇవ్వడంపై సంతోషాన్నిస్తోందంటూ చాలామంది ఈ సంస్థను ప్రశసింస్తున్నారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంత విలువ ఇస్తున్నారో దీనిని బట్టి అర్థమవుతుందిన మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.













Click it and Unblock the Notifications