హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముంబైలో ఆంధ్రా మహిళా టెక్కీ హత్య, రింగ్ ఆధారంగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Techie
ముంబై: మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా టెక్కీ శవమై కనిపించింది. సెలవుల కోసమని వచ్చి తిరిగి వెళ్తుండగా షోలాపూర్‌లో ఉన్నప్పుడు చివరి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమయ్యారు. దాదాపు పది రోజుల క్రితం అదృశ్యమైన ఆమె విగతజీవిగా కనిపించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన 23 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజనీర్ ఈస్తర్ అనూహ్య ముంబైలోని టిసిఎస్‌లో పని చేస్తున్నారు.

సెలవుల కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబై బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. గురువారం ముంబైలోని కంజుమార్గ్‌లో ఆమె మృతదేహం కాలిపోయి కనిపించింది. ఈ మృతదేహం అనూహ్యదని తండ్రి ప్రసాద్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని బట్టి కుటుంబ సభ్యులు గుర్తించారు.

సెలవుల కోసం వచ్చిన ఆమె ముంబై వెళ్లేందుకు విశాఖపట్నం - ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ నెల 4న విజయవాడలో ఎక్కారు. ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో తండ్రితో ఫోన్లో మాట్లాడారు. అప్పుడు రైలు షోలాపూర్‌లో ఉంది. అంధేరీలోని తన హాస్టల్‌కు చేరాక మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఫోన్ రాలేదు.

తండ్రి ప్రసాద్ ఎంతగా ప్రయత్నించినా స్పందన లేదు. ఆమె స్నేహితులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో కూతురు కనిపించట్లేదని విజయవాడ రైల్వే స్టేషన్లో 5న ఫిర్యాదు చేశారు. 8న ముంబై వచ్చి కుర్లా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చివరకు నిన్న కంజుమార్గులో కాలిన గాయాలతో కుళ్లిన మృతదేహం లభించిందని, అది అనూహ్యదిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మర్డర్ కేసుగా నమోదు చేశారు.

English summary
The family of a 23 year old software engineer from 
 
 Andhra Pradesh, who has been missing since January 5, 
 
 on Thursday claimed to have found her body in Bhandup, 
 
 an eastern suburb of Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X