బీహర్‌లో బస్సు ప్రమాదం, 10 మంది మృతి
పాట్నా:బీహార్ రాష్ట్రంలోని సీతారామర్హి జిల్లాలోని రున్ని సైద్పూర్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెళుతూ ప్రమాదవశాత్తు ఓ వంతెన పైనుండి కిందికి పడిపోయింది. శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 10 మంది వరకు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

ఇంకా ఈ బస్సు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రును వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
మరోవైపు ఈ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications