అన్నం తిను: దాడికి ముందు తల్లికి ఉగ్రవాది ఫోన్
న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిగి దిగిన ఉగ్రవాదుల ఆనవాళ్లను ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో టెర్రరిస్టులకు లింక్ ఉన్నట్లు నిఘావర్గాలు స్పష్టం చేశాయి. ఎయిర్ బేస్‌పై దాడికి ముందు ఓ ఉగ్రవాది పాకిస్థాన్‌లో ఉన్న తన తల్లితో శుక్రవారం అర్ధరాత్రి మాట్లాడాడు.
మొత్తం నాలుగు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలను నిఘావర్గాలు శనివారం వెల్లడించాయి. ఉగ్రవాది తన తల్లితో మాట్లాడుతూ ఉగ్రదాడి చేయబోతున్నానని, బతుకుతానో లేదో తెలియదని చెప్పాడు. దీనిపై స్పందించిన అతడి తల్లి చనిపోయే ముందు అన్నం తినాలని సూచించింది.
ఆకలితో చనిపోవద్దని అన్నం తినాలని సూచించినట్లు నిఘావర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు హైజాక్ చేసిన కారులో జైషే మొహ్మద్ లేఖను పోలీసులు గుర్తించారు. జైషే మొహ్మద్ అని రాసి ఉన్న ఓ కాయితాన్ని కారు డ్రైవర్ జేబులోంచి స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో ఆ డ్రైవర్ మృతిచెందాడు.
శనివారం ఉదయం తెల్లవారుజామున మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. వీరిలో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. పంజాబ్ పోలీసులు ప్రకారం మరో ఉగ్రవాది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడిని వివిధ పార్టీల నేతలు ఖండించారు.
దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రవాదులతో పోరులో అమరులైన జవాన్ల కుటుంబాలకు రాహుల్ సంతాపం తెలిపారు.
Strongly condemn terrorist attack on Pathankot AirForce Base.My deepest condolences to families of the brave soldiers martyred in the attack
— Office of RG (@OfficeOfRG) January 2, 2016 Hope the new year brings much joy and happiness to you and everyone close to you! (2/2)
— Office of RG (@OfficeOfRG) December 28, 2015 శాంతిని ఎదుర్కోలేని వారే ఎప్పటికప్పుడు దాడులు చేస్తుంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఉగ్రవాదుల దాడి వల్ల నష్టం భారీ ఎత్తున జరిగి ఉండేదని, కానీ సరైన సమయంలో నిఘావర్గాలు సమాచారం అందడం వల్ల పెను ప్రమాదాన్ని నియంత్రించగలిగామని పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అన్నారు.
దాడుల సమయంలో విదేశాంగ విధానాన్ని ప్రశ్నించడం సరైంది కాదని, ఉగ్రవాదులతో నిత్యం పోరాటం చేస్తున్న జవాన్లకు అండగా ఉండాలని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. భారత్, పాకిస్థాన్ దేశాలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడాన్ని ఉగ్రవాదులు వ్యతిరేకిస్తున్నారు. దానికి నిదర్శనమే ఈ దాడులు అని ఛత్తీస్‌ఘడ్ సీఎం రమణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
పఠాన్ కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్.... త్రివిద దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సౌత్‌బ్లాక్‌లో పారికర్‌తో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ , ఎయిర్ ఫోర్స్ చీఫ్ అరూప్ రహా, నేవీ చీఫ్ రాబిన్ దోవన్ భేటీ అయ్యారు.
NSA Ajit Doval arrives at South Block #Pathankot pic.twitter.com/KS9LgJovSE
— ANI (@ANI_news) January 2, 2016 IAF chief Arup Raha, Navy Chief Robin Dhowan and Defence Minister Manohar Parrikar arrive at South Block #Pathankot pic.twitter.com/qVIx1xq6jk
— ANI (@ANI_news) January 2, 2016 Not right to question foreign policy right now, stand with our soldiers in this fight-Lalu Prasad Yadav #Pathankot pic.twitter.com/KSGHNerIVe
— ANI (@ANI_news) January 2, 2016 Terrorists can't tolerate India-Pakistan dialogue,this is in reaction to that-Raman Singh,Chhattisgarh CM #Pathankot pic.twitter.com/TQ62wtsuEE
— ANI (@ANI_news) January 2, 2016 











Click it and Unblock the Notifications