లాక్ డౌన్ 4.0పై కేంద్రం కీలక ఆదేశాలు- సడలింపులపై రాష్ట్రాలకు హెచ్చరికలు....
దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0 విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూనే మరికొన్ని అంశాల్లో నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే ఇచ్చేసిన విషయాన్నీ వివరించింది. గతంలో సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో అవసరమైతే ఆంక్షలు విధించుకోవచ్చని, అయితే నియంత్రణలు ఉన్న ప్రాంతాల్లో సడలింపులను దుర్వినియోగం చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేదని తెలిపింది.
అలాగే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నిర్ణయించే విషయంలోనూ పలు మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూనే స్ధానిక సంస్ధలు, స్ధానిక అధికార యంత్రాంగం ఇచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయాలు ఉండాలని సూచించారు.

కంటైన్ మెంట్ జోన్లలో నిబంధనలు మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. జోన్ల నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదేపదే కోరిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారాన్ని కట్టబెట్టింది
-
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications