వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రీన్ పీస్ ఇండియా రిజిస్ట్రేషన్ రద్దు

|
Google Oneindia TeluguNews

చెన్నై: వాయు కాలుష్యంతో పాటు అనేక సమస్యలపై పోరాటం చేస్తున్న గ్రీన్ పీస్ ఇండియా స్వచ్చంద సంస్థకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నామని తమిళనాడు రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ తెలిపింది.

గ్రీన్ పీస్ ఇండియా జాతీయ సంస్థ అయినా తమిళనాడు సొసైటీస్ చట్టం కింద రిజిస్టర్ అయ్యింది. అయితే గ్రీన్ పీస్ సంస్థ కార్యక్రమాలపై కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. బెంగళూరు నగరంలోని కార్యాలయంలో ఓ ఉద్యోగినిపై అక్కడి పై అధికారులు లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

Cancelled the registration of Greenpeace India

తరువాత ఆ యువతి గ్రీన్ పీస్ ఇండియాలో ఉద్యోగానికి రాజీనామ చేసి సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండ గ్రీన్ పీస్ ఇండియా అక్రమాలకు పాల్పడుతున్నదని, విదేశాల నుంచి విరాళాలు వసూలు చేసి దుర్వినియోగం చేస్తున్నదని కేంద్ర ప్రభుత్వం మండిపడింది.

ఇప్పుడు గ్రీన్ పీస్ ఇండియా రిజిస్ట్రేషన్ రద్దు కావడంతో ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్థను రద్దు చెయ్యడం అన్యాయమని తాము మద్రాసు హై కోర్టును ఆశ్రయిస్తామని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ తెలిపింది.

English summary
The Tamil Nadu Registrar of Societies has cancelled the registration of Greenpeace India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X