‘‘ఒక పోలీసుగా ఈ దారుణాలను నేను చూడలేకపోతున్నా.. అందుకే రాజీనామా చేస్తున్నా..’’
ఏడు సంవత్సరాలుగా కాశ్మీర్ లో పోలీసుగా విధులు నిర్వహిస్తున్న రయీస్ అనే వ్యక్తి, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ, అందుకుగల కారణాలను చెబుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది.
కశ్మీర్: ఏడు సంవత్సరాలుగా కాశ్మీర్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రయీస్ అనే వ్యక్తి, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ, అందుకుగల కారణాలను చెబుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది.
కాశ్మీర్ లో హింస పెరిగిందని, బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని, తన మనస్సాక్షి మరణిస్తూ ఉంటే చూస్తుండలేకనే రాజీనామా చేశానని రయీస్ ఈ వీడియోలో వెల్లడించాడు.
తాను చేస్తున్నది రైటో, రాంగో తెలియదని, ఓ పోలీసు అధికారిగా ఇక్కడ రక్తపాతాన్ని చూడలేక పోతున్నానని ఆయన చెప్పారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియకనే రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చానని చెప్పాడు.

"నా జీహాద్ (పవిత్ర యుద్ధం) ఎంతో క్లిష్టంగా సాగుతోంది. నేను ఉద్యోగంలో చేరేటప్పుడు పౌరుల సమస్యలు పరిష్కరిస్తారని ప్రమాణం చేశాను. కానీ, కాశ్మీర్ లోయలో ఆపలేని పెను తుఫాను కొనసాగుతోంది. ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణం. ప్రతిరోజూ కాశ్మీరీలను కాల్చి చంపుతున్నారు. ఎంతో మంది కళ్లు పీకుతున్నారు. జైళ్లలో వేస్తున్నారు. గృహ నిర్బంధాలు సర్వసాధారణం.కాశ్మీర్ ప్రజలు తమ స్వాతంత్రాన్ని కోరుకుంటూ ఉండటమే సమస్యగా మారింది..'' అని రయీస్ తన వీడియోలో పేర్కొన్నారు.
అంతేకాదు, '' ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నారు. అది ఎన్నటికీ జరగదని తెలుసు. అలాగే ఈ రక్తపాతం కూడా ఆగదు. నేను పాక్ ను ఇష్టపడను. ఇండియాను ద్వేషించను. కాశ్మీర్ ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ శాంతి కావాలి. అది నా చేతుల్లో లేదని తెలుసు. అందుకే ఓ పోలీసుగా రక్తపాతాన్ని చూడలేక రాజీనామా చేస్తున్నాను..'' అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. రయీస్ వీడియోను పరిశీలిస్తున్నామని ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications