బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విహారయాత్ర: ఏడుగురి జలసమాధి

|
Google Oneindia TeluguNews

హసన్: విహారయాత్రకు వెలుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు జలసమాధి అయిన సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా చెన్నరాయపట్టణ తాలుకాలో జరిగింది. ఇదే ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ముగ్గురు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారు.

బెంగళూరు నగర శివార్లలోని బిడది సమీపంలోని టయోటా కంపెనీలో జనార్దన్ (22), సతీష్ (24), కార్తీక్ (24), జయంత్ (23), దిలీప్ (24), శివస్వామి (24), రాజు (24) తదితరులు ఉద్యోగం చేస్తున్నారు. వీరందరూ స్నేహితులు.

రెండు రోజులు సెలవులు ఉండటంతో చిక్కమంగళూరుకు విహారయాత్రకు వెళ్లాలని నిర్ణయించారు. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత 10 మంది స్కార్పియో వాహనంలో చిక్కమగళూరు బయలుదేరారు.

 A case has been registered in Chennarayapatna police station in Karnataka

మార్గం మధ్యలో చెన్నరాయపట్టణ తాలుకాలోని జనివార కెరె (జనివార చెరువు) దగ్గర కారు అదుపుతప్పింది. ఒక్క సారిగా కారు చెరువులో పడిపోయింది. చెరువు పూర్తిగా నీటితో నిండిపోవడంతో ఏడుగురు సంఘటనా స్థలంలోనే జలసమాధి అయ్యారు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు చెరువులో గాలించి ప్రాణాలతో ఉన్న ముగ్గురు యువకులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ముగ్గురూ ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
7 killed and 3 injured after Scorpio car fell into Janivara lake at Channarayapatna, Hassan district on Saturday early morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X