జీఎస్టీ బిల్లు అప్ లోడ్ చేయండి-కోటి వరకూ నగదు గెల్చుకోండి-కేంద్రం కొత్త స్కీం..

దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏటికేడాది పెరుగుతున్నాయి. అయినా వీటిని మరింతగా పెంచుకునేందుకు వీలుగా కేంద్రం కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. "మేరా బిల్ మేరా అధికార్ " పేరుతో జీఎస్టీ బిల్లుల్ని అప్ లోడ్ చేస్తే బహుమతులు ఇచ్చే కొత్త పథకాన్ని వచ్చే నెల 1 నుంచి ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మనం షాపులో ఎక్కడైనా జీఎస్టీ బిల్లు తీసుకుంటే దాన్ని వెబ్ సైట్ లేదా యాప్ లో అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. లక్కీ డ్రాలో కోటి వరకూ నగదు గెల్చుకునే అవకాశం లభిస్తుంది.

షాపుల్లో, మాల్స్ లో ఇతరత్రా ఎక్కడ షాపింగ్ చేసినా తప్పనిసరిగా కస్టమర్లు వాటిని అమ్మిన వారి నుంచి జీఎస్టీ బిల్లులు అడిగి తీసుకునేలా ఈ పథకం ప్రోత్సహించబోతోంది. ఇలా తీసుకున్న బిల్లుల్ని కేంద్రం సూచించిన వెబ్ సైట్ లేదా యాప్ లో అప్ లోడ్ చేస్తే మూడు నెలలకోసారి డ్రా తీసి అందులో ఎంపికైన వారికి కోటి రూపాయల వరకూ నగదు బహుమతి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో ఈ పథకాన్ని కేవలం ఆరు రాష్ట్రాలకు పరిమితం చేయబోతున్నారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు వర్తింపచేస్తారు.

cash rewards upto 1cr for uploading gst bills received, centre to launch new scheme from sept 1

ఈ జీఎస్టీ రివార్డు పథకంలో భాగంగా నగదు బహుమతి పొందాలనుకునే వారు షాపింగ్ చేసినప్పుడు జీఎస్టీ బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక వేళ ఇవ్వకపోతే తప్పనిసరిగా అడిగి తీసుకోవాలి. అలా తీసుకున్న బిల్లుల్ని మేరా బిల్ మేరా అధికార్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

అయితే లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే మాత్రం కనీస బిల్లు రూ.200 చేసి ఉండాలి. ఓ నెలలో గరిష్టంగా 25 బిల్లుల్ని అప్ లోడ్ చేసే అవకాశం కల్పించారు. ఇలా చేసిన తర్వాత మూడు నెలలకు నిర్వహించే డ్రాలో ఎంపికైతే రూ.10 వేలు, 10 లక్షలు, కోటి రూపాయల చొప్పున నగదు బహుమతి అందుకోవచ్చు.

అయితే ఈ స్కీమ్ ను ప్రస్తుతానికి ఆరు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో అసోం, గుజరాత్, హర్యానా, కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలీ, పుదుచ్చేరిలో మాత్రమే సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరిస్తారు. ఈ స్కీమ్ అమలుతో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+