• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్ video: నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత -చెల్లెలి చావుకు అన్నల ప్రతీకారం -అనూహ్య మలుపు

|

కరోనా వేళ అసలే మెడికల్ స్టాఫ్ కొరత నెలకొన్న రాజస్థాన్ లో డాక్టర్ దంపతుల హత్యోదంతం సంచలనంగా మారింది. కారులో ప్రయాణిస్తోన్న డాక్టర్ దంపతులను పట్టపగలే నడిరోడ్డుపై అతి కిరాతకంగా హతమార్చారు. కారుకు అడ్డంగా బైకులు నిలిపి, దగ్గరికెళ్లిమరీ తుపాకితో షూట్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ సంఘటన వెనకున్న అనూహ్య కోణాలను పోలీసులు వెల్లడించారు..

శని దేవుడి ఆగ్రహం: శనివారం రోజున ఏవి కొనుగోలు చేయకూడదు- ఏ రాశివారు ఎలాంటి రత్నాన్ని ధరించాలి<br>శని దేవుడి ఆగ్రహం: శనివారం రోజున ఏవి కొనుగోలు చేయకూడదు- ఏ రాశివారు ఎలాంటి రత్నాన్ని ధరించాలి

భారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలుభారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలు

నడిరోడ్డుపై కాల్చివేత..

నడిరోడ్డుపై కాల్చివేత..

రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్‌ సిటీలో దారుణం జరిగింది. కారులో వెళ్తున్న డాక్ట‌ర్ దంప‌తుల‌పై ఇద్ద‌రు వ్యక్తులు కాల్పులు జ‌రిపారు. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో డాక్ట‌ర్‌ సుదేశ్ గుప్తాతో పాటు ఆయ‌న భార్య సీమా గుప్తా స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. న‌గ‌రంలో రద్దీగా ఉండే క్రాసింగ్ వ‌ద్ద ఈ కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఆ సమయంలో రోడ్డుపై పెద్దగా రద్దీ లేదు..

బైక్ అడ్డం పెట్టి, దగ్గరికెళ్లి..

బైక్ అడ్డం పెట్టి, దగ్గరికెళ్లి..

నేరం జరిగిన తీరు చేస్తూ, డాక్టర్లు ప్రయాణిస్తున్న కారును దుండగులు ఫాలో అవుతూ, సమయానుకూలంగా కాల్పులు జరిగినట్లుంది. కారును ఫాలో అవుతూ, సరిగ్గా సర్కిల్ వద్దకు రాగానే కాస్త నిదానించడంతో దుండగులు కారుకు అడ్డంగా బైక్ లను నిలిపారు. మొత్తం ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు కారు దగ్గరకు వెళ్లగా, డ్రైవ‌ర్ సీటులో ఉన్న డాక్ట‌ర్‌ సుదేశ్.. విండో తీస్తుండ‌గానే.. దుండగుడు తుపాకితో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు, డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్న సీమను కూడా గురి పెట్టి కాల్చుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కగా,

 చెల్లెలి చావుకు ప్రతీకారంగా..

చెల్లెలి చావుకు ప్రతీకారంగా..

కాల్పుల్లో చనిపోయిన డాక్టర్ దంపతులు 2019నాటి ఓ హత్య కేసులో నిందితులు. గతేడాది జైలులో ఉన్న సుదేశ్, సీమాలు కొంత కాలం కిందట బెయిల్ పై విడుదలయ్యారు. కరోనా వేళ డాక్టర్ల కొరత ఉండటంతో వీళ్లిద్దరు కూడా డ్యూటీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుదేశ్ క్లినిక్ లో అసిస్టెంట్ గా పనిచేసిన దీపా దేవి, ఆమె ఆరేళ్ల కొడుకు సూర్యా 2019లో హత్యకు గురయ్యారు. దీపకు సుదేశ్ తో రిలేషన్ ఉండేదని, ఆ విషయం తెలిసి సీమ.. దీప, ఆమె కొడుకును గదిలో బంధించి నిప్పు పెట్టిందని రికార్డుల్లో ఉంది. ఇప్పుడు డాక్టర్లను హత్య చేసిన ఆ ఇద్దరు వ్యక్తులను అర్జున్ గుర్జాన్, మహేష్ గుర్జార్ గా గుర్తించామని, వాళ్లిద్దరూ (2019లో)చనిపోయిన మహిళ(దీప)కు సోదరులు అవుతారని, బహుశా డాక్టర్ల హత్య ప్రతీకార చర్య అయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. తాజా ఘటనపై కేసు నమోదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
A doctor couple was shot dead in broad daylight by unknown bikers in in Rajasthan’s Bharatpur on Friday, prompting the opposition to question the law and order situation in the state. The victims have been identified as Sudeep Gupta and his wife Seema Gupta, both doctors by profession. According to police, the two bike-borne assailants who shot the couple have been identified as the brother and cousin of a woman who was allegedly murdered in 2019. both Sudeep and his wife were jailed last year and now out on bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X