బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తం: డిపోలోకెళ్లి 52 బస్సులకు నిప్పు, జయకు సిద్ధూ లేఖ
బెంగళూరు: కావేరీ నీటి వివాదం నేపథ్యం లో బెంగళూరు అట్టుడుకుతోంది. నిరసనకారులు బెంగళూరు బస్టాండులో ఉన్న 52 తమిళనాడు రాష్ట్ర బస్సులకు నిప్పు పెట్టారు. ఆ బస్సులు కోయంబత్తూరుకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులుగా తెలుస్తోంది. ఈ బస్సులు డిపోలో ఉండగా నిరసనకారులు నిప్పు పెట్టారు.
దాదాపు 200 మంది నిరసనకారులు డిపోలోకి చొచ్చుకు వచ్చారు. వాటికి నిప్పు అంటించారు. సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల సమయంలో వీరు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ బస్సులన్నీ తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్నాయి. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో కనిపించిన వాహనాలను నిరసనకారులు తగులబెడుతున్నారు.

దీంతో ఉదయం నుంచి తమిళనాడు రిజిస్ట్రేషన్ బస్సులు బయటకు రాలేదు. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో బయట కనిపించిన లారీలను, కార్లను, ఇతర వాహనాలను తగులబెట్టారు. మధ్యాహ్నం హోంమంత్రి పరమేశ్వరన్ మాట్లాడుతూ.. పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. 27 వాహనాలు దగ్ధమైనట్లు తెలిపారు.
రంగంలోకి సిఆర్పీఎఫ్
బెంగళూరు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో పది కంపెనీల సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ రంగంలోకి దిగింది. దాదాపు రెండు వందల మంది నిరసనకారులు అదుపులోకి తీసుకున్నారు.
హోంమంత్రి పరమేశ్వరన్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు వల్ల కర్నాటకకు అన్యాయం జరిగిందన్నారు. అయితే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూస్తామని చెప్పారు.

అత్యవసర కేబినెట్ భేటీ
బెంగళూరులో తాజా పరిస్థితుల నేపథ్యంలో రేపు (మంగళవారం) మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు కేబినెట్ అత్యవవసరంగా సమావేశం కానుంది.
కాల్పులు
హెగ్గనహళ్లి, రాజ్ గోపాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.
తమిళులు ఉన్నచోట భారీబందోబస్తు, చిత్ర ప్రదర్శన నిలిపివేత
బెంగళూరులో తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కర్నాటక ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. నగరంలోని థియేటర్లలో చిత్ర ప్రదర్శనలు నిలిపి వేశారు.
https://www.facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.facebook.com%2Farryacuddalore%2Fvideos%2F1082745921774797%2F&display=popup&ref=plugin&src=video
నివేదిక కోరిన కేంద్రం
బెంగళూరులోని తాజా పరిస్థితుల ైన కేంద్రం నివేదిక కోరింది. కేంద్ర హోంశాఖ కర్నాటక ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని అడిగింది.

జయలలితకు సిద్ధరామయ్య లేఖ
కర్నాటక సీఎం సిద్ధరామయ్య తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు. కావేరి జలాల వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న నిరసనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో ఉన్న కన్నడ ప్రజలకు రక్షణ కల్పించాలని ఆ లేఖలో కోరారు.
కన్నడీయులపై తమిళనాడులో జరుగుతున్న దాడులను ఆపేందుకు రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని జయలలితను కోరారు. తమ రాష్ట్రంలోనూ శాంతి, భద్రతలు నెలకొల్పేందేకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications