మాల్యాకు షాక్: తెలిసీ రూ.900 కోట్ల లోన్ ఇచ్చారు, బ్యాంక్ మాజీ చైర్మన్ సహా అరెస్ట్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం నాడు నలుగురు కింగ్ ఫిషర్ అధికారులను అరెస్టు చేసింది. ఐడీబీఐ లోన్ డిఫాల్టు కేసులో వారిని సీబీఐ అరెస్టు చేసింది.
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం నాడు నలుగురు కింగ్ ఫిషర్ అధికారులను అరెస్టు చేసింది. ఐడీబీఐ లోన్ డిఫాల్టు కేసులో వారిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు ఐడీబీఐ అధికారులను కూడా అరెస్టు చేసింది.
అరెస్టైన ఐడీబీఐ అధికారుల్లో.. మాజీ చైర్మన్, ముగ్గురు బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. నలుగురు ఐడీబీఐ అధికారులు, నలుగురు మాల్యా కంపెనీ అధికారులు.. మొత్తం ఎనిమిది మంది అరెస్టయ్యారు.

అంతకుముందు, సోమవారం ఉదయం 12 మందితో కూడిన అధికారుల బృందం యూబీ గ్రూప్ కార్యాలయంలో పత్రాలను పరిశీలించింది. ఐడీబీఐ నుంచి తీసుకున్న రూ.900 కోట్ల లోనుకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేశారు.
ఐడీబీఐ బ్యాంకు లోను ఇవ్వడంపై అనుమానాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ భారీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసి కూడా లోన్ ఇచ్చినట్లుగా తెలుస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పత్రాలను పరిశీలించారు. కంపెనీ లాస్‌లో ఉన్నట్లుగా తెలిసి కూడా లోను ఇచ్చినట్లుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications