వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు మరో షాక్: భర్త కూడా జైలుకెళ్లక తప్పదా? ఇదీ కేసు?

అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళకు మరో చేదు వార్త! ఆమె భర్త నటరాజన్‌ను ఓ కేసు వెంటాడుతోంది. శశికళ జైలుకు వెళ్లాక చాలామంది ఆమె భర్త నటరాజన్ గురించి చర్చించుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళకు మరో చేదు వార్త! ఆమె భర్త నటరాజన్‌ను ఓ కేసు వెంటాడుతోంది. శశికళ జైలుకు వెళ్లాక చాలామంది ఆమె భర్త నటరాజన్ గురించి చర్చించుకున్నారు.

<strong>శశికళకు రివర్స్: ప్రాణహానీ లేదని చెప్పిన కర్నాటక ఐబీ, అదే జరిగితే..</strong>శశికళకు రివర్స్: ప్రాణహానీ లేదని చెప్పిన కర్నాటక ఐబీ, అదే జరిగితే..

ఇంత జరుగుతున్నా నటరాజన్ ఎందుకు మౌనం వహించారనే అంశం చర్చకొచ్చింది. అయితే తాజాగా నటరాజన్‌‌ను కూడా కోర్టు కేసు వెంటాడుతోంది. 1993 నాటి సీబీఐ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణకు రాబోతోంది.

1994లో కారు దిగుమతి

1994లో కారు దిగుమతి

1994లో నటరాజన్ విదేశాల్లో వినియోగించే లెక్సస్ కారును దిగుమతి చేసుకున్నారు. ఆ వాహనం 1993 మోడల్ పాత కారు అని దొంగపత్రాలు సృష్టించి సుంకాన్ని ఎగ్గొట్టి ఫెరా చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి.

నటరాజన్ వల్ల రూ.కోటి నష్టం

నటరాజన్ వల్ల రూ.కోటి నష్టం

ఇతని చర్య వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. కోటి మేర నష్టం వాటిల్లిందని ఈడీ చెబుతోంది. ఈ కేసును విచారించిన సీబీఐ, ఈడీ నటరాజన్‌పై వేరువేరుగా కేసు నమోదు చేశాయి. ఆర్థిక నేరాలను విచారించే కోర్టుకు ఈడీ ఈ కేసుకు సంబంధించి లేఖ రాసింది.

త్వరగా విచారించాలని..

త్వరగా విచారించాలని..

ఈ కేసును త్వరితగతిన విచారణకు స్వీకరించాలని తాజాగా.. సీబీఐ మద్రాస్ హైకోర్టుకు విన్నవించింది. ఈ కేసు ఫిబ్రవరి 27న మద్రాస్ హైకోర్టులో తుది విచారణకు రానుంది. శశికళతో బాటు, ఆమె జైలుకెళ్లే ముందు నియమించిన అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీడీ దినకరన్ పై పెండింగులో ఉన్న కేసులను కూడా త్వరగా విచారించాలని ఆర్థిక నేరాల కోర్టుకు ఈడీ లేఖ రాసింది.

శశికళ ఆవేదన!

శశికళ ఆవేదన!

ఈ కేసుల తీవ్రతను చూస్తే నటరాజన్, దినకరన్‌లు కూడా కటకటాలు లెక్కించక తప్పదని ప్రత్యర్థులు అంటున్నారు. జైల్లో ఉన్న శశికళకు ఇప్పటికే ఈ సమాచారం అందినట్లుగా కూడా సమాచారం. భర్త కూడా జైలుకెళతారేమోనని ఆమె ఆవేదన చెందుతున్నారట.

English summary
A CBI case against M Natarajan, husband of the jailed AIADMK general secretary VK Sasikala, in connection with import of a Lexus car in 1994 is picking up momentum in the Madras high court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X